Begin typing your search above and press return to search.

జీవన్మరణ సమస్యగా చేశారు...గంటా ఫైర్

By:  Tupaki Desk   |   3 May 2022 8:33 AM GMT
జీవన్మరణ సమస్యగా చేశారు...గంటా ఫైర్
X
వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య కాలంలో ఆయన వైసీపీ మీద గట్టిగానే తన సౌండ్ పెంచుతున్న సంగతి తెలిసిందే.

ఏపీలో వైసీపీ సర్కార్ పాలన మీద ఆయన లేటెస్ట్ గా మరో కోణంలో కామెంట్స్ చేశారు. పూర్వపు విద్యా శాఖ మంత్రి కూడా అయిన గంటా ప్రస్తుతం జరుగుతున్న పదవతరగతి పరీక్షల తీరుతెన్నున మీద ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో టెన్త్ పరీక్షలు నిర్వహించే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక పేపర్ లీక్ అవుతోందని వార్తలు వస్తున్నాయని, పరీక్ష నిర్వహణలోలో మొత్తం లోపాలు ఉన్నాయని కూడా గంటా పేర్కొన్నారు. పరీక్షలను సవ్యంగా ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అని ఆయన నిలదీశారు.

పరీక్షలు సక్రమంగానిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు. ఆ విషయంలో ఏ కాస్తా తప్పు జరిగినా అది పదవ తరగతి విద్యార్ధుల మానసిక స్థితి మీద పెను ప్రభావం చూపిస్తుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒక విధంగా టెన్త్ పరీక్షలు విద్యార్ధులకు జీవన్మరణ సమస్యగా పేర్కొన్నారు. ఈ విషయంలో అసలు నిర్లక్ష్యం తగదని కూడా గంటా సూచించారు.

తాము అధికారంలో ఉన్నపుడు కచ్చితంగా అకాడమికి ప్రణాళికను రూపొందించామని, ఆ విధంగా ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షలు జరిపించామని ఆయన అన్నారు. అదే సమయంలో పరీక్షల నిర్వహణలో ఏ చిన్న అపోహ కానీ సందేహం కానీ తమ పాలనలో చోటు చేసుకోలేదని కూడా ఆయన చెప్పుకున్నారు.

అయితే ఇపుడు పరీక్షలు నిర్వహిస్తున్న తీరు చూస్తూంటే విద్యార్ధులు వాటి మీద నమ్మకాన్ని కోల్పోయేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తానికి విద్యా శాఖను అయిదేళ్ళ పాటు టీడీపీ ఏలుబడిలో చూసిన గంటా లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. మరి దీనికి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి