Begin typing your search above and press return to search.
పాక్ పై పోరాటంలో పశ్చిమ గోదావరి పల్లె
By: Tupaki Desk | 1 Oct 2016 4:49 AM GMTదేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఒక వీర జవాను మాత్రమే అనుభూతి చెందగల ఒక గొప్ప అనుభూతి. శత్రుమూకలు ముంచుకొస్తున్నా... మీసాన్ని మెలేసి దేశం కోసం పోరాడటంలో ఉన్న కిక్ వేరు. మేరా భారత్ మహాన్ అంటూ రొమ్ము విరుచుకుని సరిహద్దులో నిలబడగల జవాను జీవితం ధన్యం. అలాంటి వీర జవాన్లకు ఆ ఊరు పుట్టినిల్లు. ప్రతీ ఇంటి నుంచీ ఒకరిని సైన్యంలోకి పంపిన నేల అది. సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ ఊరిలోని ప్రతీ ఇల్లూ దేశభక్తి ఉరకలువేస్తోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటే... పశ్చిమ గోదావరి జిల్లాలోని మాధవరం.
ఈ ఊరిలో ప్రతీ ఇంట్లో ఒక సైనికుడు పుడతాడు. ఏదో ఒక హోదాలో భరతమాతకు సేవ చేసినవాడై ఉంటాడు. తమ బిడ్డల్ని ఎంతో గర్వంగా సైన్యంలోకి పంపడం ఆ గ్రామస్థులకు ఆనందం. నిడదవోలుకు సమీపంలో ఉన్న ఈ గ్రామం నుంచి ప్రస్తుతం 109 మంది సైన్యంలో ఉన్నారు. వీరిలో 65 మంది జవాన్లు. మిగతావాళ్లు వివిధ సైనిక విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రతీ ఇంటి నుంచీ ఒక సైనికుడిని తయారు చేసే స్ఫూర్తి ఈ గ్రామస్థులకు ఎక్కడి నుంచి వచ్చిందంటే... అది వాళ్ల బ్లడ్ లోనే ఉంది. అవును, సైన్యంలో సేవలు అందించడం అనేది మాధవరం ప్రజలకు తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద.
దాదాపు 300 సంవత్సరాలుగా మాధవరం ప్రజలు సైన్యంలో సేవలందించడం ప్రారంభించారు. అప్పట్లో వివిధ సంస్థానాల్లోనూ రాజ్యాల్లోనూ సైనికులుగా పనిచేసేవారు. పూసపాటి మాధవవర్మ పాలనా కాలం నుంచి వీరు సైన్యంలో చేరడం మొదలైంది. సైన్యంలో చేరడం ఆనాటి నుంచే ఓ సంప్రదాయంగా మారిపోయింది. పల్నాడు, బొబ్బిలి వంటి రాజ్యాల్లో మాధవరం సైనికులు పనిచేశారు. బ్రిటిష్ సైన్యంలో కూడా మాధవరం వారు సేవలు అందించారు. మొదటి ప్రపంచయుద్ధంలో 90 మంది సైనికులు ఈ గ్రామం నుంచి పాల్గొన్నారు. ఇక, ఈ గ్రామంలో ఎక్స్ సర్సీస్ మెన్ విషయానికొస్తే... దాదాపు 1200 మంది వరకూ ఉన్నారు. ఈ ఊళ్లోవారు పేర్లు పెట్టి పిలుచుకోరు! సైన్యంలో పొందిన హోదాలతోనే వీళ్లంతా ఒకరిని ఒకరు పిలుచుకుంటూ ఉంటారు. అంతేకాదు, పిల్లలకు కూడా సుబేదార్, కమాండర్, కెప్టెన్, మేజర్ లాంటి పేర్లు పెడుతూ ఉంటారు.
సైన్యంలో ఉత్తమ సేవలు అందించి అవార్డులు అందుకున్నవారు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. మాధవరం గ్రామానికి చెందిన సుబేదార్ వెంకటాచలం రావుబహద్దూర్ బిరుదు పొందారు. విక్టోరియా క్రాస్ పతకం కూడా అందుకున్నారు. ఈయన తనయుడు చైనా - బంగ్లాదేశ్ యుద్ధాల్లో పాల్గొన్నారు. ఈయన మనవడు మానస్ ప్రస్తుతం సైన్యంలో సేవలందిస్తున్నారు. ఈ విధంగా సైనిక పరంపర కొనసాగుతోంది. భారత దేశానికి సైనికులను అందించడంలో మాధవరం కృషిని ప్రభుత్వం గుర్తించిందని చెబుతున్నారు. త్వరలో ఈ గ్రామంలో సైనిక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా మాధవరం ప్రజలు అంటున్నారు. భరతమాత నుదిటిపై వీర తిలకం దిద్దుతున్న సైనికులకు పుట్టినిల్లైన మాధవరానికి జయహో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/