Begin typing your search above and press return to search.
బీజేపీలో చేరినందుకు ట్రోలింగ్..మాధవీలత రిటార్ట్!
By: Tupaki Desk | 7 May 2018 8:13 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమాని అయిన హీరోయిన్ మాధవీలత హఠాత్తుగా బీజీపీలో చేరడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. జనసేనలో మాధవీలత చేరబోతోందని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరి అందరికీ షాక్ ఇచ్చింది. శనివారం నాడు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో మాధవీలత బీజేపీలో చేరడం టాలీవుడ్ తో పాటు ఇరు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుందని, అయితే జనసేనలో తాను చేరబోతోన్నట్లు ఎక్కడా ప్రకటించలేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాధవీలతపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, ఆ విమర్శలకు మాధవీ లత ఘాటుగా రిటార్ట్ ఇచ్చింది. బీజేపీలో చేరిన వెంటనే తన క్యారెక్టర్ మారిపోతుందా అంటూ నెటిజన్లపై మాధవీ లత ఎదురుదాడి చేసింది.
బీజేపీలో చేరిన తర్వాత మాధవీలతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. పవన్ కు మద్దతిచ్చి...జనసేనలో కాకుండా బీజేపీలో చేరడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఆ కామెంట్లకు మాధవీలత ఘాటుగా బదులిచ్చింది. ఇన్నాళ్లు తన క్యారెక్టర్ గురించి ఎవరూ మాట్లాడలేదని, బీజేపీలో చేరిన వెంటనే తన క్యారెక్టర్ పోతుందా అని ఆమె ప్రశ్నించింది. తన వ్యక్తిత్వాన్ని ఒక పార్టీ ఎలా మార్చేస్తుందని ప్రశ్నించింది. తాను ఎల్లపుడు మంచి చెయ్యాలనే ఆలోచిస్తానని, వేరేమీ తెలీదని మాధవీలత చెప్పింది. నచ్చని పార్టీలో చేరింనందుకు తనను దూషిస్తారా అని ప్రశ్నించింది. తమ కుటుంబంలోనే వివిధ పార్టీలకు చెందిన వారున్నామని, ఎవరిష్టం వాళ్లదని చెప్పింది. తాను బీజేపీలో చేరిన ఫొటోలను ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ ట్రోలింగ్ మొదలైంది.