Begin typing your search above and press return to search.
షాకింగ్: బీజేపీలో చేరిన మాధవీలత
By: Tupaki Desk | 6 May 2018 7:26 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా హీరోయిన్ మాధవీలత....ఫిల్మ్ చాంబర్ ముందు మౌన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తాను పవన్ అభిమానినని, ఆయనను దూషించడం తనకు బాధ కలిగించిందని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ప్రదర్శన తర్వాత మాధవీలత...జనసేనలో చేరబోతోందని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాధవీలత....బీజేపీలో చేరి అందరికీ షాక్ ఇచ్చింది. శనివారం నాడు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో మాధవీలత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా, తాను జనసేనలో చేరబోతున్నట్లు ఎక్కడా ప్రకటించలేదని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
బీజేపీలో చేరిన మాధవీలత....మీడియాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే అపుడు...ఎపుడూ ఇష్టం, అభిమానమని....అది ఎప్పటికీ అలానే ఉంటుందని మాధవీలత చెప్పింది. గతంలో జనసేనకు సపోర్ట్ చేశానని, అయితే ఆ పార్టీలో చేరబోతోన్నట్లు తాను ఎక్కడా ప్రకటన చేయలేదని తెలిపింది. గతంలో జనసేనకు మద్దతు తెలిపి ఇపుడు బీజేపీలో చేరకూడదా...అని ఎదురు ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో మోదీ గారి ఐడియాలజీ నచ్చి ఆయనకు సపోర్ట్ చేశారని, ఆ కారణంతోనే తాను బీజేపీ, మోదీలకు మద్దతిస్తున్నానని తెలిపింది. పవన్ కళ్యాణ్ కోసం మౌనదీక్ష చేస్తున్నపుడు మీడియా ఫోకస్ చేసిందని....ఆసిఫా కోసం చేసిన ర్యాలీలపై శ్రద్ధ వహించలేదని మీడియాపై సెటైర్ వేసింది. మొత్తం మీద జనసేనలో చేరుతుందని భావించిన మాధవీలత...అనూహ్యంగా బీజేపీలో చేరడం టాలీవుడ్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.