Begin typing your search above and press return to search.

మోడీ దుర్మార్గుడని తేలిపోయిందట

By:  Tupaki Desk   |   18 Dec 2018 11:24 AM GMT
మోడీ దుర్మార్గుడని తేలిపోయిందట
X
సినీ రంగం నుంచి రాజకీయాల బాట పట్టిన కొందరి విన్యాసాలు మామూలుగా ఉండవు. సినీ కెరీర్ పై పూర్తిగా ఆశలు వదులుకున్నాక భారతీయ జనతా పార్టీలో చేరి హడావుడి చేస్తున్న హీరోయిన్ మాధవీలత సంగతి తెలిసిందే. తనను పట్టించుకునేవాళ్లు లేకపోయినా.. ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం ద్వారా వార్తల్లో నిలవాలని ఆమె ప్రయత్నిస్తోంది. తాజాగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఒక పోస్టు పెట్టింది ఫేస్ బుక్ లో. ఇందులో ఆమె మోడీని దుర్మార్గుడిగా పేర్కొనడం విశేషం. మామూలుగా చూస్తే ఇది నెగెటివ్ గా కనిపిస్తుంది కానీ.. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే మాధవీలత ఉద్దేశమేంటో అర్థమవుతుంది. ఇంతకీ ఫేస్ బుక్ పోస్టులో మాధవీలత ఏమందంటే..

‘‘నేను బీజేపీ లో జాయిన్ అయ్యిందే అసలు దేశానికి బీజేపీ నిజాంగా సహాయం చేస్తుందా నాశనం చేస్తుందా అని తెలుసు కోవడానికి. నిజంగా మోడీ దుర్మార్గుడు. రోజు అయన ఏమి చేసాడో చెప్తా వినండి. ఎపుడో చిన్నపుడు స్కూల్లో జాతీయగీతం పాడాను. మర్చిపోయి చాలా ఏళ్లయింది. ఎవడికి కావాలి తొక్కలో గీతం .. మీటింగ్స్ పెట్టిన అదే ఎం జరిగిన అదే ఆఖరికి ఎంజాయ్ చేద్దామని మూవీకి పోతే జాతీయగీతమా ఏమయ్యా మోదీ మాకు అవసరమా మజా చేద్దామని సినిమా కి పోతే దేశభక్తి ఏంటి మాకు ఛీ పని పాట లేని పనులు మీరు. మాకొద్దు ఇలాంటివి. మేం పక్కా లోకల్ పక్కా లోకల్ అలాంటి పాట పడుకుంటాం కిక్ వస్తది. అయ్యా మోడీ నీకు దేశభక్తి ఉంటే నువ్ పాడుకో. మీ మీద ఎందుకు రుద్దడం. నీవల్ల దేశానికి ఎం ఉపయోగం’’ అని పేర్కొన్న మాధవీలత.. ఈ పోస్టుకు ‘I Hate MoDI’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది. దీని మీనింగ్ ఏంటో అర్థమైన వాడు ‘ఇండియన్’ అంటూ ఇంకో వ్యాఖ్య కూడా పెట్టింది. మరి మాధవీలత పోస్టును ఎవరెలా తీసుకుంటారో చూడాలి.