Begin typing your search above and press return to search.
మాట వినని మధుప్రియ
By: Tupaki Desk | 30 Oct 2015 9:48 AM GMTప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్దమైన వర్దమాన గాయని, ఉద్యమ గాయని అయిన మధుప్రియకు తల్లిదండ్రులు, పోలీసులు ఎంత నచ్చజెప్పినా కూడా తన ప్రియుడిని తక్షణం వివాహమాడడానికే నిర్ణయించుకుంది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి జరిగిన హై డ్రామాకు తెరపడింది. ఈ రోజు సాయంత్రం సిర్పూర్ కాగజ్ నగర్ లో మధుప్రియ వివాహం ఆమె ప్రియుడు శ్రీకాంత్ తో జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమ మాట వినకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను విడిచి వెళ్లారు.
ఆడపిల్లనమ్మా పాటతో పాపులారిటీ పెంచుకున్న కరీంనగర్ కు చెందిన సింగర్ మధుప్రియ ప్రేమ వ్వవహారం వివాదాస్పదంగా మారింది. నెల రోజుల క్రితమే 18 సంవత్సరాలు నిండిన సింగర్ మధుప్రియ తాను మేజర్ నని, తన పెళ్లిని ఇష్టమైన వాడితో చేసుకోవచ్చని పోలీసుల ఎదుట వాదించింది. తమ కూతురు ఇంకా చిన్నపిల్లేనని, ఇంత చిన్న వయసులో పెళ్లేంటని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. మధుప్రియ భవిష్యత్ దెబ్బతేసేందుకు ఎవరో పన్నిన పన్నాగం అని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో మధుప్రియ, ఆమె ప్రియుడు శ్రీకాంత్ ను కాగజ్ నగర్ పోలీసులు ఎన్నో రకాలుగా నచ్చజెప్పారు. చిన్నవయసులో పెళ్లి వల్ల కలిగే ఇబ్బందులు వివరించారు.
గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నప్పటికీ, తాను మేజర్ అయిన తరువాత మాత్రమే విషయం బయటపెట్టాలని ముందే మధుప్రియ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మధుప్రియ ప్రేమించిన శ్రీకాంత్ గురించి ఆయన నివసించే నల్లకుంట వాసులు భిన్న కథనాలు వినిపిస్తున్నారు. శ్రీకాంత్ నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్నాడని కొందరు చెబుతుంటే, లేదు... అతను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగి మాత్రమేనని ఇంకొందరు అంటున్నారు. హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలో మధుప్రియ కుటుంబం కూడా నివాసం ఉంటుంది. ఆ సమీపంలోనే శ్రీకాంత్ కూడా ఉండేవాడని, అప్పుడే ఇద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. గతంలో శ్రీకాంత్ కొన్ని షార్ట్ ఫిలింలను తీశాడని తెలుస్తోంది. వీటిల్లో కొన్నింటిలో మధుప్రియ ప్రధాన పాత్రల్లో నటించిందని తెలుస్తోంది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టినట్టు సమాచారం. సింగర్ మధుప్రియ ఇంటర్ పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మధు ప్రియ గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో 26 ఆగస్టు 1997న పుట్టింది. గత ఐదు రోజులుగా కాగజ్ నగర్ లోనే మధుప్రియ ఉంటోంది. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు కాగజ్ నగర్ వాసవీ గార్జెన్ లో ఆమె వివాహం జరగాల్సి ఉండగా సాయంత్రానికి వాయిదా పడింది.