Begin typing your search above and press return to search.
యాష్కీ నోట.. చండీయాగం నిధుల మాట
By: Tupaki Desk | 22 Dec 2015 4:25 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగానికి సంబంధించి ఆసక్తికర ఆరోపణ ఒకటి చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి నిధులు ఎక్కడవని ప్రశ్నించిన యాష్కీ.. దానికి సమాధానం తానే చెప్పేశారు. భారీ ఖర్చుతో కూడుకున్న యాగానికి నిధులు ఎక్కడ నుంచి సమకూరాయో చెప్పాలని డిమాండ్ చేస్తూనే.. మరోవైపున ఆరోపణలు చేసేశారు.
కేసీఆర్ నిర్వహిస్తున్న యాగానికి నిధులు నారాయణ.. చైతన్య కాలేజీల నుంచి వచ్చిన ముడుపులతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను చేసిన ఆరోపణ నిజం కాకుంటే.. నిధుల వివరాలు.. ప్రజలు అందించాలంటూ డిమాండ్ చేశారు. ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో ఇలాంటి ఆరోపణలు మామూలే. కాకుంటే.. ఉత్తగా ఆరోపణలు చేసే కన్నా.. కనీసం కాసిన్ని ఆధారాలు చూపించి ఆరోపణలు చేసి ఉంటే హుందాగా ఉండేది.
అలాకాకుండా.. ఏదో ఒక ఆరోపణ చేయాలన్నట్లుగా యాష్కీ మాటలు ఉన్నాయంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ముడుపుల ఆరోపణలు చేసే విషయంలో పస ఉండాలే కానీ. అవి నస మాటలుగా ఉంటే.. నష్టం పార్టీకేనన్న వాస్తవాన్ని యాష్కీ గుర్తిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.