Begin typing your search above and press return to search.

టీఆరెస్ కు కొత్త పేరు పెట్టిన మధు యాష్కీ

By:  Tupaki Desk   |   23 April 2017 9:18 AM GMT
టీఆరెస్ కు కొత్త పేరు పెట్టిన మధు యాష్కీ
X
కొత్త రాష్ర్టం తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆరెస్ పార్టీకి కాంగ్రెస్ నేతలు కొత్త పేరు పెట్టారు. టీఆర్ ఎస్ అంటే తెలంగాణ రాష్ర్ట సమితి కాదని... తెలంగాణ రాబందుల సమితి అని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ విమర్శించారు. ఆ పార్టీని మించిన గలీజు పార్టీ మరొకటి లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రూ.300 కోట్ల ప్రజా ధనంతో నిర్మించుకున్న బంగ్లాలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు రైతులను పరామర్శించే తీరిక కూడా లేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారిని రక్షించుకునేందుకు నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. జీహెచ్ ఎంసీలో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగితే దానికి బాధ్యుడైన మంత్రి కేటీఆర్‌ పై చర్య తీసుకోకుండా ఓ అధికారిని సస్పెండ్ చేసి ఊరుకున్నారని పేర్కొన్న యాష్కీ... కేసుల భయంతోనే కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నారని ఆరోపించారు.

కాగా చాలాకాలంగా మధుయాష్కీ యాక్టివ్ గా లేరు. మళ్లీ ఇప్పుడు ఒక్కసారిగా టీఆరెస్ పై ఆరోపణలతో బయటకొచ్చారు. అయితే.. కాంగ్రెస్ నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండడంతో టీఆరెస్ విషయంలో ఆ పార్టీ నేతలు ఎంతగా గొంతు చించుకుంటున్నా దాని వల్ల ఫలితం ఉండడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/