Begin typing your search above and press return to search.
మోడీ మాయలో కేసీఆర్..కవిత తెలంగాణ శకుంతల
By: Tupaki Desk | 29 Oct 2018 4:04 PM GMTతెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి నిజామాబాద్ మాజీ ఎంపీ మదుయాష్కీ విరుచుకుపడ్డారు. గులాబీ బాస్ ఢిల్లీ టూర్ కేంద్రంగా ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ తన కంటి పరిక్షలకు ఢిల్లీకి వెళతారు ప్రజలకు మాత్రం రాష్ట్రంలో కంటివెలుగు అంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీ ప్రేమలో కేసీఆర్ గుడ్డివాడయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ఆంధ్రవాళ్ళదనే కేసీఆర్ ఢిల్లీలో కంటి పరీక్షలు చేయించుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. ఓటమి భయంతో కేటిఆర్ ఆంధ్రవాళ్లకు అండగా ఉంటారంటున్నారని యాష్కీ తెలిపారు.
కళ్ళముందు కనిపిస్తున్న ఓటమితో కేసీఆర్ ఫ్యామిలీ లాగులు తడుస్తున్నాయని యాష్కీ వ్యాఖ్యానించారు. నిన్నటి దాకా సీమాంధ్రులను కేసీఆర్ తిట్టిన తిట్లు కేటీఆర్‌కు గుర్తులేవా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు సీమాంధ్రులను అంటే నచ్చరన్నారు. సీమాంధ్రులకు కోసం పనిచేసేది...ఎల్లప్పుడూ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీయేనని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. ఆంధ్ర విద్యార్థులకు చదువు దూరం చేయడానికి మీ అయ్య కేసీఆర్ ఫాస్ట్ పథకం తెచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. దుబాయ్ శేఖర్ - శేఖర్ మామాగా పిలిచే ఇప్పటి కేసీఆర్ కు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన నిలదీశారు. మహాకూటమి విజయం తథ్యమని సర్వేలు చెబుతుండటంతో కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. కేటీఆర్ నోరు మూసి కంటే కంపు కొడుతుందని యాష్కీ ఆరోపించారు. కేటీఆర్ ఓ బెత్తెంగాడని యాష్కీ అన్నారు.
కల్వకుంట కుటుంబంను చూసి ఊసరవెళ్లులు కూడా సిగ్గుపడుతున్నాయని యాష్కీ భగ్గుమన్నారు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం కేసీఆర్ ఫ్యామిలీ నైజమని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలు సీమాంధ్రులను కించపరచడమేనని, అమరావతికి వందకోట్లు బిక్షమిస్తున్నట్లు కేటీఆర్ మాట్లాడటం దారుణమన్నారు. సీమాంధ్ర ప్రజలారా ..టీఆరెస్ నేతల బెదిరింపులకు భయపడకండి .. మేము మీకు అండగా ఉంటాం అని క్షమించారు. సీమాంధ్రులపై టీఆర్ఎస్ నేతల బెదిరింపులు - దాడులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేస్తున్నామని ప్రకటించారు. త్వరలో టీఆర్ఎస్ ఎంపీలు - ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రకటించారు. కల్వకుంట్ల కుటుంబం జనం రక్తం తాగుతున్న క్రూరమృగాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ఓటుతో రాజకీయ బొంద పెట్టాలన్నారు. అక్రమ ఆస్తులలో కవిత తెలంగాణ శశికళ అని మండిపడ్డారు. బామ్మర్దిని బినామీగా పెట్టి కేటీఆర్ దోచుకుంటున్నది నిజమని యాష్కీ దుమ్మెత్తిపోశారు.