Begin typing your search above and press return to search.
మోడీ మేజిక్ పనిచేసిందే.. వాళ్ల దశ తిరిగింది
By: Tupaki Desk | 30 July 2020 1:30 AM GMTదేశ ప్రధాని మోడీ మన్ కీ బాత్ పేరిట ప్రతీ ఆదివారం తన మనోభావాలను వెల్లడిస్తుంటారు. ఆయన వైఫల్యాలపై ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా కూడా మోడీ క్రేజ్ మాత్రం దేశంలో తగ్గడం లేదు. ఆయనను అభిమానించే వారు కోట్లలో ఉంటున్నారు.
తాజాగా తన మన్ కీ బాత్ లో ‘మధు బనీ’ పెయింట్స్ గురించి మోడీ ప్రత్యేకంగా ఈ ఆదివారం ప్రస్తావించారు. వారు తయారు చేసే మాస్కుల గురించి.. వాటి ప్రత్యేకతను వివరించారు. దర్భబంగా జిల్లాకు చెందిన దాదాపు 2500 మంది కళాకారులు తయారు చేస్తున్న విలక్షణమైన మాస్కులపై అందమైన పెయింట్లను మెచ్చుకున్నారు.
మోడీ నోటి వెంట మధుబనీ పేరు రావడమే ఆలస్యం వారి గురించి అందరూ ఆరాతీస్తున్నారు. 72 గంటల్లోనే వారికి డిమాండ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా అందరూ ఫోన్లు చేస్తూ ఆర్డర్లు ఇస్తున్నారట.. ఇప్పటికే 2 లక్షల పెయింటింగ్ మాస్కుల్ని వీరు సరఫరా చేశారు.
మోడీ మన్ కీ బాత్ లో చెప్పి ఈ కళాకారుల ప్రతిభను వెలికితీయడంతోపాటు వారి దారిద్య్రాన్ని పారద్రోలాడని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.