Begin typing your search above and press return to search.

ఈ బూతుపురాణం ఏంది స్పీక‌ర్ జీ?

By:  Tupaki Desk   |   17 Sep 2018 4:38 AM GMT
ఈ బూతుపురాణం ఏంది స్పీక‌ర్ జీ?
X
ఎప్పుడు ఎలా ఉన్నా.. ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చి ప‌డిన వేళ‌.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల్సిన అవ‌స‌రం చాలానే ఉంటుంది. కానీ.. ఆ చిన్న విష‌యాన్ని మ‌ర్చిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి. త‌న వ‌ద్ద‌కు క‌ష్టాన్ని చెప్పుకోవ‌టానికి వ‌చ్చిన వ్య‌క్తిపై అస‌హ‌నంతో విరుచుకుప‌డుతున్న ఆయ‌న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవ‌స‌రం లేకున్నా.. అంత‌లా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. రాయ‌లేని రీతిలో బూతులు తిట్టేయ‌టం.. అది కూడా ప‌బ్లిక్ గా కావటాన్ని ప‌లువురు తప్పు ప‌డుతున్నారు. కూల్ గా ఉండే సిరికొండ అంత సీరియ‌స్ కావ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా శాయంపేట మండ‌లం ప‌త్తిపాకలో ప‌ల్లెనిద్ర కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసుకున్నారు సిరికొండ మ‌ధుసూద‌నాచారి. అయితే.. గ్రామంలోకి వ‌చ్చినంత‌నే ఆయ‌న‌కు స‌మ‌స్య‌ల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌టం.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు స‌మ‌స్య‌ల్ని ప్ర‌స్తావించ‌టంతో ఆయ‌న బ్యాలెన్స్ మిస్ అయ్యారు. తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. అయితే.. ఇందులో సిరికొండ‌దే త‌ప్పు త‌ప్పించి.. గ్రామ‌స్తుల‌ది ఏ మాత్రం త‌ప్పు కాదంటున్నారు.

ఎందుకంటే.. ఆయ‌న‌కు ఆయ‌నే మీ స‌మ‌స్య‌లు తీరుస్తాన‌ని చెప్పిన త‌ర్వాత ఒక‌రి త‌ర్వాత ఒక‌రు స‌మ‌స్య‌లు చెప్ప‌టం షురూ చేశార‌ని.. దానికే అంత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తే ఎలా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అంద‌రి స‌మ‌స్య‌లు ఒక ఎత్తు అయితే గ్రామానికి చెందిన బండ ర‌జినీక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం స్పీక‌ర్ ను సీరియ‌స్ అయ్యేలా చేసింది. త‌న సోద‌రుడు విజేంద‌ర్ రెడ్డికి విక‌లాంగ ఫించ‌న్ రావ‌టం లేద‌ని.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో పింఛ‌న్ వ‌చ్చింద‌ని.. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పింఛ‌న్ ఎందుకు ఆగిపోయింద‌ని ప్ర‌శ్నించారు.

దీంతో మ‌స్తు సీరియ‌స్ అయిన స్పీక‌ర్ బూతుపురాణాన్నిషురూ చేశారు. ఏ మాత్రం రాయ‌లేని రీతిలో ఉన్న ఆయ‌న మాట‌ల‌తో గ్రామ‌స్తులు కామ్ అయ్యారు. అనంత‌రం ఆదివారం నీ ఇంటికి వ‌చ్చి నీతో మాట్లాడ‌తాన‌ని చెప్పారే కానీ.. ఆదివారం ఆయ‌న త‌మ ఇంటి ముందు నుంచి వెళ్లినా.. త‌మ ఇంటికి రాలేద‌ని బాధితుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఇలా లేనిపోని పంచాయితీలు పెట్టుకోవ‌టం అవ‌స‌ర‌మా సిరికొండ‌?