Begin typing your search above and press return to search.
శ్రీదేవి పేరును తొలగించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం!
By: Tupaki Desk | 28 Feb 2018 6:30 AM GMTఏ మాత్రం ఊహించలేని రీతిలో జరిగిన శ్రీదేవి మరణం గురి చేసిన షాక్ ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మరో షాక్ గా చెప్పాలి. ఇవి సరిపోవన్నట్లుగా మీడియాలో ఆమెకు సంబంధించి వచ్చిన వార్తలు.. కొన్ని టీవీ ఛానల్స్ వ్యవహరించిన వైనం చూసినప్పుడు వెగటు పుట్టించాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. శ్రీదేవి మరణం నేపథ్యంలో ఆమెకు సంతాపాన్ని తెలిపేలా ఒక తీర్మానాన్ని తయారు చేశారు. ఇందులో శ్రీదేవి పేరుతో పాటు.. ఈ మధ్యనే మరణించిన శశికపూర్ పేరు కూడా ఉంది. ఏమైందో ఏమో కానీ.. చివరిక్షణంలో శ్రీదేవి పేరును తొలగించటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్సిస్తోంది.
సంతాప తీర్మానం పెట్టి చివరి క్షణాల్లో జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. శ్రీదేవి పేరుతో పాటు.. శశికపూర్ పేరును జాబితా నుంచి తొలగించారు. ప్రభుత్వ తీరును విపక్ష కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారు. ఈ రోజు అసెంబ్లీలో బీజేపీ సర్కారు తీరును కాంగ్రెస్ సభ్యులు ఎండగట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.