Begin typing your search above and press return to search.
మధ్యప్రదేశ్ సీఎంగా నరేంద్ర తోమర్ ... బీజేపీ వ్యూహం ఇదే!
By: Tupaki Desk | 23 March 2020 9:38 AM GMTమధ్యప్రదేశ్ రాజకీయ సస్పెన్స్ కు తెరపడింది. రెబల్స్ ను దారికి తెచ్చుకోవడంలో విఫలమవడంతో.. బల నిరూపణకు ముందే సీఎం కమల్ నాథ్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బలపరీక్షకి కొద్ది గంటల ముందు సీఎం పదవికి రాజీనామా చేసారు. దీనితో ఇక మధ్యప్రదేశ్ సీఎం బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానే అని అందరూ అనుకున్నారు. కానీ, మధ్యప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులని చూస్తే ..బీజేపీ ఆలోచనలు వేరేలా ఉన్నాయని చెప్పవచ్చు.
శివరాజ్ సింగ్ చౌహానే కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అందరికి షాక్ ఇస్తూ , మధ్యప్రదేశ్ కి చెందిన కేంద్ర వ్యవసాయ మంత్రి, నరేంద్ర మోదీ కి అత్యంత ఆప్తుడైన నరేంద్ర సింగ్ తోమర్ పేరునిను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థుతుల నేపథ్యంలో సీఎం పదవికి తోమర్ అన్ని రకాలుగా అర్హుడని అధిష్టానం భావిస్తుంది. ఈయన గతంలో బీజేపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అలాగే మోడీకి అత్యంత ఆప్తుడు కావడం ఈయనకు కలిసొచ్చే అంశం. అయితే , తోమర్ కాబోయే సీఎం అంటూ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.
మధ్యప్రదేశ్ లో ఓబీసీ వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న కూడా ఈ వర్గానికి చెందిన ఓటర్లు చాలా కీలకం. అలాగే ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉమా భారతి, బాబూలాల్ గౌర్, శివరాజ్ సింగ్ ..ఈ ముగ్గురు కూడా ఓబీసీ వర్గానికి చెందిన వారే. అయితే , తాజా సీఎం పదవి ఇవ్వాలని చూస్తున్న తోమర్ క్షత్రియ వర్గానికి చెందిన నేత. అలాగే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వీడీ శర్మ కొనసాగుతున్నారు.
వీడీ శర్మ, తోమర్ ఇద్దరూ అగ్ర కులాలకు చెందినే నేతలే. దీనితో బీజేపీలోని ఇతర వర్గీయుల నుంచి ఇబ్బంది ఏర్పడుతుందేమోనన్న భయం ఓ వర్గంలో ఉన్నప్పటికీ, ప్రస్తుత అవసరాల దృష్ట్యా తోమర్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపిస్తుంది. అంతేకాకుండా రాబోయే కొన్ని రోజుల్లో చంబల్, గ్వాలియర్ నియోజకవర్గాల్లోని 25 అసెంబ్లీ స్థానాలకు కీలకమైన ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వీడీ శర్మతో పాటు తోమర్ కూడా ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే తోమర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
అధిష్టానం లెక్కలు ఏవైనా కూడా ...2005 నుంచి 2018 వరకు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని బీజేపీ అధిష్ఠానం తోమర్ ని ఎంచుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయాలలో ఉద్ధండుడు అని చెప్పవచ్చు, అలాగే రాజకీయాలలో అత్యంత నిజాయితీ పరుడిగా, అందరి నోళ్లల్లో మామా అని పిలిపించుకుంటూ ..ప్రజలకి దగ్గరగా ఉంటారు. అయితే , ఇలాంటి ప్రజాభిమానం గల గొప్ప నేతని పక్కన పెట్టి .. తోమర్ ను సీఎం పదవికి ఎంపిక చేయబోతుంది. ఇది బీజేపీకి ఏవిదంగా కలిసొస్తుందో చూడాలి ..