Begin typing your search above and press return to search.

అంత పెద్ద పార్టీకి ఆ రాష్ట్రంలో వాస్తు దోషం

By:  Tupaki Desk   |   15 July 2017 10:21 AM GMT
అంత పెద్ద పార్టీకి ఆ రాష్ట్రంలో వాస్తు దోషం
X
వాస్తు అన్న‌ది ఇళ్ల‌కు.. స్థ‌లాల‌కు మాత్ర‌మే కాదు పార్టీల‌కు కూడా ఉంద‌న్న విష‌యాన్ని చెబుతున్నారు కాంగ్రెస్ నేత‌లు. జాతీయ పార్టీకి ఆ రాష్ట్రంలో వాస్తు దోషం ప‌ట్టిన‌ట్లుగా చెబుతున్న వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. గ‌డిచిన‌14 సంవ‌త్స‌రాలుగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో వృద్ధ కాంగ్రెస్ ఓడిపోవ‌టానికి కార‌ణంగా ఆ పార్టీకి చెందిన ప్ర‌ధాన కార్యాల‌యంలోని ఇందిరా భ‌వ‌న్ లోని మ‌రుగుదొడ్ల కార‌ణంగానే పార్టీ ఓడిపోతున్న‌ట్లుగా చెబుతున్నారు.

నిజానికి ఒక పార్టీ గెలుపు ఓట‌ములు అన్న‌వి ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కాల్ని అనుస‌రించి కానీ.. వాస్తు మీద కాద‌ని ఎంత చెప్పినా విన‌ని ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. బాత్రూంలో ఉన్న వాస్తుదోషంతోనే పార్టీ ఓడిపోతున్న‌ట్లుగా ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత‌లు వాదిస్తున్నారు. 2003లో క‌ట్టించిన పార్టీ బిల్డింగ్ మూడో అంత‌స్తులో ఉన్న టాయిలెట్లు తూర్పు అభిముఖంగా ఉన్నాయ‌ని.. వాస్తు ప్ర‌కారం అలా ఉండ‌కూడ‌ద‌ని చెబుతున్నారు.

ఆ బాత్రూంల కార‌ణంగానే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంద‌న్నారు. ఈ దోషాన్ని స‌రిదిద్దేందుకు నేత‌లు ఇప్పుడు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీ బిల్డింగ్ లో వాస్తు దోషాన్ని సెట్ చేయాల‌ని భావిస్తున్నారు. పార్టీలోని ప‌లువురు నేత‌లు.. కార్య‌కర్త‌లు బ‌లంగా న‌మ్ముతున్న ఈ వాస్తు దోషాన్ని స‌రి చేయాల‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కొంద‌రు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు మాత్రం ఇంకా వాస్తు దోషం అంటారే..ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకోవ‌ట‌మ‌న్న రాజ‌కీయ నాయ‌కుల క‌నీస బాధ్య‌త‌ను మిస్ అయితేనే .. ఈ త‌ర‌హా వాస్తు దోషాల గురించి మాట్లాతుంటార‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ‌ర్గాల్ని త‌ప్పు ప‌డుతున్నారు.