Begin typing your search above and press return to search.

ఎంపీలో బలపరీక్షకు అనుమతివ్వండి..సుప్రీంకు బీజేపీ

By:  Tupaki Desk   |   16 March 2020 10:05 AM GMT
ఎంపీలో బలపరీక్షకు అనుమతివ్వండి..సుప్రీంకు బీజేపీ
X
మధ్యప్రదేశ్ లో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ రెడీ అయ్యింది. కమల్ నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారుకు తాజాగా జ్యోతిరాధిత్య సింధియా షాకిచ్చి 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోయారు. దీంతో కమల్ నాథ్ సర్కారు మైనార్టీలో పడిపోయింది.

ఈ అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ.. మధ్యప్రదేశ్ వెంటనే బలపరీక్ష నిర్వహించేలా కమల్ నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టు తలుపు తట్టింది.మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పది మంది ఎమ్మెల్యేలు కలిసి ఈ పిటీషన్ వేయగా సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.

మెజార్టీకి ఒకటి రెండు సీట్లు మాత్రమే ఎక్కువున్న కమల్ నాథ్ సర్కార్ నుంచి 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజాగా జ్యోతిరాధిత్య సింధియా నేతృత్వంలో రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. దీంతో కమల్ నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. ఇదే విషయాన్ని బీజేపీ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

కాగా సోమవారం బలపరీక్ష నిర్వహించాలని మధ్యప్రదేశ్ గవర్నర్ ఆదేశించినా సీఎం కమల్ నాథ్ ఖాతరు చేయడం లేదు. అసెంబ్లీని 26వరకు వాయిదా వేసేసింది. అసెంబ్లీలో గవర్నర్ ను ఘెరావ్ చేసింది. దీంతో బీజేపీ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. బలపరీక్ష చేసేలా ఆర్డర్ ఇవ్వాలని కోరింది.