Begin typing your search above and press return to search.

హంగ్ దిశగా మధ్యప్రదేశ్ !

By:  Tupaki Desk   |   11 Dec 2018 8:20 AM GMT
హంగ్ దిశగా మధ్యప్రదేశ్ !
X
మధ్యప్రదేశ్‌ లో ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వెళ్తున్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. అక్కడి ఫలితాలు చూస్తుంటే హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మధ్యప్రదేశ్‌ లో ఇద్దరు మంత్రులు వెనకంజలో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ నెమ్మదిగా పుంజుకుంటున్నట్లు ఫలితాలు తెలుపుతున్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు - కార్యకర్తలు - కమల్‌ నాథ్ ఇంటి వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారని తెలుస్తోంది.

మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీకి పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. అప్పటికి పరిస్దితి బీజేపీకి - కాంగ్రెస్‌ కి మధ్య హోరాహోరిగా ఉన్నట్లు సమాచారం. అయితే అప్పటికి హోం మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ మాత్రం తమ పార్టీ గెలుపుపై ధీమా గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ లో ఉదయం 11.15 నిమిషాలకి కాంగ్రెస్‌ దే పైచేయిగా ఉంది. మొత్తం 116 స్దానాలలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా మ్యాజిక్ ఫిగర్‌కి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నాయకులైన కమల్‌ నాథ్ - జ్యోతిరాదిత్య సింధియా తమ గెలుపు పట్ల ధీమాగా ఉన్నట్లు చెప్పారు. అయితే బీఎస్పీ 7 స్దానాలలో ముందంజలో ఉంది. 11.45 నిమిషాలకు కాంగ్రెస్ కొంచెం వెనకుబడి ఉండగా గాలి భారతీయ జనతా పార్టీపై మళ్లింది. అప్పటికి కాంగ్రెస్ 106 స్దానాలలో మందంజలో ఉండగా, భారతీయ జనతా పార్టీ 115 స్దానాలలో ముందున్న‌ట్లు సమాచారం. అయితే మధ్యహ్నం 12 40 నిమిషాలకు మ‌ళ్లీ పోరు హోరాహోరిగా సాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ 106 స్దానాలలో ముందంజలో ఉండగా, భారతీయ జనతా పార్టీ కూడా ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్ ఫలితాలు రావాలంటే కొద్దిసేపు ఆగక తప్పదు. హంగ్ వ‌స్తే.. బీఎస్పీ మ‌ద్ద‌తుతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌స్తుందంటున్నారు.