Begin typing your search above and press return to search.
ఎన్నికల సీజన్ కాకున్నా ఉల్లి ఫ్రీ అన్న సీఎం
By: Tupaki Desk | 26 Aug 2016 7:19 AM GMTఎన్నికలు దగ్గర్లోకి వస్తున్నాయంటే చాలు.. అధికారపక్షానికి హటాత్తుగా సంక్షేమం గుర్తుకు వస్తుంది. అప్పటివరకూ ప్రజల్ని త్యాగాలు చేయమన్న పెద్ద మనుషులే.. మీరేం కష్టపడకండి.. మీ కష్టాల్ని మేం మోస్తామని బిల్డప్ ఇచ్చి మరీ సంక్షేమ స్వరాన్ని వినిపిస్తూ.. వరాల మీద వరాలు కుమ్మరించేస్తుంటారు. అయితే.. ఇందుకు భిన్నమైన సీన్ ఒకటి మధ్యప్రదేశ్ లో నెలకొంది. ఎన్నికలు లేకున్నా.. ఉచితం మాట చెప్పి ఊరిస్తోంది. తన మీద పడిన నష్టాన్ని ఉచితంతో కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ముందుచూపు లేని వైనం కారణంగా సర్కారు ఖజానాకు కోట్లాది రూపాయిలు నష్టం వాటిల్లనుంది. అయితే.. ఇలాంటి వాటితో వచ్చే ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవటానికి ఉచితం అంటూ ఊరిస్తోంది. తన అసమర్థతను ఉచితం మాటతో కవర్ చేస్తున్న వైనం లోకి వెళితే..
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతుల్ని ఆదుకునేందుకు రైతుల నుంచి ఉల్లిపంటను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. గోదాముల్లో పేరుకు పోయిన ఉల్లిని వినియోగించే అంశం మీద ముందే దృష్టి సారించినా బాగుండేది. కానీ.. కుళ్లే వరకూ పట్టించుకోలేదు. ఇప్పుడేమో గోదాముల్లో ఉన్న ఉల్లి నిల్వలు చెడిపోవటం మొదలు పెట్టటంతో వాటిని వృధాగా పడేయటం కన్నా ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో.. రైతుల వద్ద నుంచి కేజీ రూ.6 చొప్పున కొనుగోలు చేసిన దాదాపు 10.4 లక్షల టన్నుల ఉల్లిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిసైడ్ చేశారు.
చిత్రమైన విషయం ఏమిటంటే.. ఉల్లి రైతుల్ని ఆదుకోవటానికి చౌహాన్ ప్రభుత్వం రైతుల నుంచి ఉల్లి పంటను కొనుగోలు చేసింది. వాటిని నిల్వ చేసే సౌకర్యం లేకపోవటంతో కొనుగోలుచేసిన సర్కారుకు.. అవి చెడిపోవటం మొదలు పెట్టిన తర్వాత కానీ విషయం అర్థం కాలేదు. దీంతో ఊరికే పోవడం కంటే ఉచితంగా ఇచ్చి పేరు సంపాదించుకుందామని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఉచితంగా ఉల్లిని పంపిణీ చేయాలని డిసైడ్ చేసింది. దీంతో.. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.