Begin typing your search above and press return to search.

ఓటరు చైతన్యానికి నెటిజన్ల ఫిదా

By:  Tupaki Desk   |   6 May 2019 11:28 AM GMT
ఓటరు చైతన్యానికి నెటిజన్ల ఫిదా
X
విషాదం వెన్నంటి ఉన్నా.. పౌరుడిగా ఈ దేశం కల్పించిన హక్కును అతడు వినియోగించుకొని శభాష్ అనిపించుకున్నాడు. తండ్రి చనిపోయి దు:ఖం వెంటాడుతున్నా.. అంత్యక్రియలు అప్పుడే చేసి కుమలిపోకుండా ఓటు వేయడానికి వచ్చిన ఓ వ్యక్తి మనోధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

మీడియాలో హైలెట్ అయిన ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్తర్ పూర్ నియోజకవర్గంలో జరిగింది. అక్కడ సోమవారం ఐదోవిడత పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు అంతా ఓటుహక్కు వినియోగించుకున్నారు. అక్కడికి ఓ వ్యక్తి ఒంటిపై టవల్ తో తడిబట్టలతో వచ్చాడు. అప్పుడే కేశఖండన చేయించుకున్నాడు. చూస్తుంటే అంత్యక్రియలు ముగించుకొని స్మశాన వాటిక నుంచి వచ్చినట్టే ఉన్నాడు. ఏంటని ఆరాతీయగా.. తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేసి వచ్చానన్నాడు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశాడు.

అంతటి పుట్టెడు దుఖంలోనూ ఆ వ్యక్తి తన కర్తవ్యాన్ని నెరవేర్చడం చూసి స్థానికులు ఫిదా అయ్యారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. మీడియాలోనూ ప్రముఖంగా వస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఇంతటి నిబద్ధత అవసరమని కొందరు ప్రశంసించడం విశేషం.

మధ్యప్రదేశ్ లో సోమవారం ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. 29 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడే ఛత్తర్ పూర్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిస్తోంది.