Begin typing your search above and press return to search.
కరోనా వచ్చిన వృద్ధులు చనిపోవల్సిందే.. ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 16 April 2021 8:25 AM GMTదేశంలో కరోనా జోరుకి ఏ మాత్రం అడ్డుకట్టవేయలేకపోతున్నారు. కరోనా నియమాలు పాటిస్తూ, వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నప్పటికీ కూడా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత కరోనా జోరు కొంచెం తగ్గినా కూడా ఆ తర్వాత ఈ మద్య సెకండ్ వేవ్ అంటూ కరోనా జోరు పీక్స్ కి చేరింది. ముఖ్యంగా గత పది రోజులుగా కరోనా కేసులు ఓ రేంజ్ లో నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది. ఇందులో 1,25,47,866 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,69,743 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కు మొగ్గుచూపుతున్నాయి.
ఈ సందర్భంలో కరోనా కారణంగా పెరుగుతున్న మరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశుసంవర్ధక మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కరోనాను నివారించడానికి అందరి సహకారం గురించి మాట్లాడుతూ ముసలోళ్లు అయితే చనిపోవాల్సిందే కదా అంటూ బాధ్యతలేకుండా కామెంట్లు చేశారు. ఈ మరణాలను ఎవరూ ఆపలేరు. కరోనాను నివారించడానికి అందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ప్రతిరోజూ కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. నేను అంగీకరిస్తా. ఈ మరణాలను ఎవరూ ఆపలేరు. వయసు మీద పడిన వారు చనిపోవాల్సిందే కదా అని అన్నారు. ఇది మాత్రమే కాదు, మరణ గణాంకాలను ప్రభుత్వం దాచిపెడుతోందని మంత్రిని అడిగినప్పుడు, మంత్రి, ప్రజలు కూడా దాక్కున్నారు. ఈ విషయం ఎవరితోనూ చెప్పట్లేదు అంటూ విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.