Begin typing your search above and press return to search.
సీఎంకు కరోనా.. టెస్టులకు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ ల క్యూ
By: Tupaki Desk | 25 July 2020 1:30 PM GMTప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దేశంలో ఓ బిగ్ షాట్ ను పట్టింది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనకు కరోనా సోకిందని ట్విట్టర్ సాక్షిగా ప్రకటించడం సంచలనమైంది.
సీఎంకు కరోనా అని తెలియగానే రాజకీయ నాయకులు, మంత్రులు, ఐఏఎస్ , ఐపీఎస్ లు హడలిపోతున్నారు. అంత కట్టుదిట్టంగా ఉండే సీఎంకే కరోనా సోకడంతో ఇక తమ పరిస్థితి ఏంటోనని అందరూ కరోనా పరీక్షలకు క్యూ కడుతున్నారు. ఇక సీఎం చౌహాన్ కూడా తనతోపాటు సమీక్షల్లో పాల్గొన్న మంత్రులు, ఐఏఎస్,ఐపీఎస్ లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని పిలునివ్వడం వైరల్ గా మారింది.
రెండు రోజుల క్రితమే చౌహాన్ సీనియర్ మంత్రులు.. ఐఏఎస్ లతో సమావేశం నిర్వహించడంతో ఇప్పుడు వారంతా హడలి చస్తున్నారు. ముఖ్యంగా హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, ఆరోగ్యమంత్రి విశ్వాస్ సారంగ్ తదితరులతో బుధవారమే చౌహాన్ సమావేశమై చర్చించారు. వీరిద్దరూ సీఎంతో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో వీరంతా కరోనా పరీక్షల కోసం ఎగబడుతున్నారు.
మధ్యప్రదేశ్ లో మొత్తం 26,210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజులో 736 కేసులు నమోదయ్యాయి. అందులో 177 కరోనా పాజిటివ్ కేసులు ఒక్క భోపాల్ లోనే నమోదు కావడం గమనార్హం.