Begin typing your search above and press return to search.
పారిపోయిన కరోనా పేషేంట్..పట్టిస్తే 50 వేల నజరానా!
By: Tupaki Desk | 20 April 2020 8:50 AM GMTదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు అమలు చేస్తున్నాయి. అలాగే వ్యాధి సోకిన వారందరినీ 14 రోజుల పాటు ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రజల ప్రాణాల కోసం ..వైద్యలు - అధికారులు తమ ప్రాణాలని పనంగా పెడుతుంటే .. కొందరు పెషేంట్లు మాత్రం అధికారులను, వైద్యసిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నారు.
క్వారంటైన్ లేదా, ఐసోలేషన్ లో ఉంచిన రోగులు తప్పించుకు పారిపోతూ అందరూ భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఓ సరికొత్త ఆలోచన చేసారు. అసలు విషయం ఏమిటంటే ..మధ్యప్రదేశ్ లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన జావేద్ ఖాన్ అనే వ్యక్తికి కరోనా నిర్దారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని జబల్ పూర్ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యకళాశాల ఆసుపత్రి లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వారి కళ్లు గప్పి కరోనా రోగి జావేద్ ఖాన్ పారిపోయాడు.
దీనితో కరోనా పెషేంట్ పారిపోయేందుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం అని , దానికి పనిష్మెంట్‌గా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరుతోపాటు నలుగురు పోలీసు గార్డులను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.అలాగే ఐసోలేషన్ వార్డ్ నుండి పారిపోయిన కరోనా బాధితుడి కోసం జబల్ పూర్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి పారిపోయినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జబల్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ భరత్ యాదవ్ కోరారు. అలాగే పరారీలో ఉన్న కరోనా పేషేంట్ ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల నగదు బహుమతి ఇస్తామని మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్ జోహ్రీ ప్రకటించారు.