Begin typing your search above and press return to search.

పరువు హత్యపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   22 Jun 2020 3:30 PM GMT
పరువు హత్యపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
X
తమిళనాడులో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో యువతి తండ్రిని మద్రాస్ హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. దళిత యువకుడిని చంపిన ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధించింది.

తిరుప్పూరు జిల్లా తివర్ కు చెందిన గౌసల్య - దళిత యువకుడు శంకర్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు గౌసల్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. దీంతో గౌసల్య తండ్రి అదును చూసి శంకర్ ను కొందరు రౌడీలతో హత్య చేయించాడని ప్రచారం జరిగింది. పత్రికల్లో అదే వచ్చింది.

కేసు విచారణలో పోలీసులు గౌసల్య తండ్రి - తల్లి - కిరాయి రౌడీలపై పోలీసులు అభియోగాలు మోపారు.జిల్లా కోర్టు వీరిందరికీ ఉరిశిక్ష విధించింది.గౌసల్య తండ్రి చిన్నస్వామి హైకోర్టును ఆశ్రయించాడు.

చిన్నస్వామి, ఆయన భార్యను మద్రాస్ హైకోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. ఐదుగురు కిరాయి రౌడీలకు యావజ్జీవ శిక్ష విధించింది. హత్య చేసిన తర్వాత నాలుగురోజులకు షాపు నుంచి సీసీ ఫుటేజీ తీసుకొని మార్ఫింగ్ చేసి అభియోగం మోపారని.. వీడియోపై అభ్యంతరం ఉందని చిన్నస్వామి లాయర్ వాదించాడు. కూతురు పెళ్లి చేసుకున్నాక చిన్నస్వామి అంగీకరించారని.. శంకర్ ను హత్య చేయలేదని లాయర్ పేర్కొన్నారు. హత్య జరిగిన 15 రోజులకు నిందితులను పోలీసులు గుర్తించారన్నారు. విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు పరువు హత్యలో తండ్రి, తల్లి పాత్ర లేదని విడుదల చేశారు.