Begin typing your search above and press return to search.
రజనీకి క్లీన్ చిట్.. పిటిషన్ దారుకు కోర్టు ఫైన్
By: Tupaki Desk | 25 July 2018 8:47 AM GMTగడిచిన కొంతకాలంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తలనొప్పులు ఎదుర్కొంటున్న తమిళ సూపర్ స్టార్ రజనీ కుటుంబానికి కాస్తంత ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. రజనీ తన వియ్యంకుడికి సంబంధించిన ఆర్థిక వ్యవహారంలో ష్యూరిటీగా ఉన్నారని.. ఆయన చెల్లించలేని మొత్తానికి సూపర్ స్టార్ ను బాధ్యుడ్ని చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన కోర్టు.. ఈ అంశంలో రజనీకి ఎలాంటి బాధ్యత లేదని తేల్చింది. అంతేకాదు.. సూపర్ స్టార్ కున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యవహరించే ప్రయత్నం చేశారంటూ మండిపడింది. ఇలాంటి చౌకబారు జిమ్మక్కులు ప్రదర్శించి.. ప్రచారం పొందొద్దన్న హెచ్చరికతో పాటు.. ఇలాంటి ప్రయత్నం చేసినందుకు రూ.25వేల ఫైన్ ను విధించింది.
కాలా విజయం తర్వాత తన తర్వాతి చిత్రంపై రజనీ దృష్టి పెట్టారు. కార్తిక్ సుబ్బరాజుతో చేసే సినిమా పనుల్లో బిజీగా ఉన్న రజనీకి కోర్టు తాజా ఆదేశం రిలీఫ్ గా మారుతుందని చెబుతున్నారు. రజనీ తాజాగా చేస్తున్న సినిమా వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందని భావిస్తున్నారు.