Begin typing your search above and press return to search.

‘‘కలామ్’’ పార్టీపై బ్యాన్

By:  Tupaki Desk   |   7 May 2016 5:54 AM GMT
‘‘కలామ్’’ పార్టీపై బ్యాన్
X
దేశం గర్వించదగ్గ అతికొద్దిమంది సమకాలీన భారతీయుల్లో దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. దేశం కోసం నిరంతరం కష్టపడిన ఆయన.. ఆ మధ్యన తిరిగిరాని లోకాలకు వెళ్లటం తెలిసిందే. ఆయనకున్న ఇమేజ్ ను సొమ్ము చేసుకోవాలన్న ప్రయత్నం ఒకటి తమిళనాడులో జరిగింది. కలాం దగ్గర సలహాదారుగా పని చేసిన పొన్ రాజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అబ్దుల్ కలామ్ విజన్ ఇండియా పేరుతో ఒక రాజకీయ పార్టీనీ ఏర్పాటు చేయటమే కాదు.. ఆ పార్టీ జెండాల మీద అబ్దుల్ కలామ్ బొమ్మను ముద్రించి ప్రచారం చేయటం మొదలుపెట్టారు.

ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలామ్ పేరిట పార్టీ పెట్టిన కారణంగా రాజకీయాలకు అతీతంగా ఉన్న కలాం విగ్రహాలకు ఎన్నికల సమయంలో ముసుగులు వేయటంపై కలాం సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తూ.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన జీవితంలో రాజకీయాల్ని దరి చేరకుండా.. రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న కలాం పేరిట పార్టీ ఎలా షురూ చేస్తారంటూ 99 ఏళ్ల కలాం సోదరుడు మీరాన్ మరక్కయ్యర్ వాదిస్తున్నారు.

ఆయన వాదనను పరిగణలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు.. కలాం పేరిట పెట్టిన పార్టీని నిషేధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో.. కలాం పేరిట పెట్టిన పార్టీతో పాటు.. ఆ పార్టీకి చెందిన కార్యవర్గంపైనా నిషేధపు వేటు పడినట్లైంది. కొందరి స్వార్థాన్ని మద్రాస్ హైకోర్టు చక్కగా చెక్ పెట్టిందని చెప్పాలి.