Begin typing your search above and press return to search.

ఒకే ఇంట్లో ఉండి సహజీవనం చేసినంత మాత్రాన ఆ హక్కులు వర్తించవు

By:  Tupaki Desk   |   6 Nov 2021 7:33 AM GMT
ఒకే ఇంట్లో ఉండి సహజీవనం చేసినంత మాత్రాన ఆ హక్కులు వర్తించవు
X
సహజీవనానికి సంబంధించి మద్రాస్ హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ఏళ్ల తరబడి కలిసి ఓకే ఇంట్లో ఉన్నంత మాత్రానా వారికి... దాంపత్యానికి సంబంధించి చట్టంలో పేర్కొన్న హక్కులు వర్తించవని స్పష్టం చేసింది. సహజీవనం చేసే వారికి కనీసం ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించలేరని ఈ మేరకు తీర్పు చెప్పింది. దాంపత్య హక్కులు పొందాలంటే.. వారు వివాహమైన చేసుకోవాలి అని పేర్కొంది. ఆ పెళ్లి కూడా భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలని సూచించింది. వారు చేసుకున్న పెళ్లి కచ్చితంగా నమోదు అయితేనే చట్టపరమైన హక్కులు వారి వస్తాయని పిటిషనర్కు తేల్చి చెప్పింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్ట్లోని జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ ఆర్ విజయకుమార్లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ అప్పీల్ను కొట్టేసింది.

ఆర్ కళైసెల్వి అనే యువతి 2013 నుంచి జోసెఫ్ వ్యక్తితో సహజీవనం చేసింది. వారు ఇరువురు తమిళనాడులోని కోయంబత్తూర్లో నివాసం ఉన్నారు. అయితే వారి ఇరువురి మధ్య పెరిగిన అంతరం వల్ల ఆ వ్యక్తి ఆమెను విడిచి దూరంగా ఉంటున్నారు. పెళ్లి కానీ వీరి కాపురం సుమారు 2019 వరకు ఎటువంటి ఆటంకం లేకుండా 6 ఏళ్ల పాటు సాగింది. అయితే ఒకానొక రోజు జోసెఫ్, సెల్వీకి మధ్య వచ్చిన అంతరాల వల్ల ఆమెను విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆమె తీవ్రమైన మనస్థాపానికి గురైంది.

చివరకు చట్టపరంగా జోసఫ్ను తన వాడిని చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ధ్యేయంతోనే ఆమె తొలుత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇందుకు గానూ భారత రాజ్యాంగంలోని సెక్షన్ 32ను పేర్కొంటూ.. తన కేసు పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఇందులో భాగంగానే తనకు జోసెఫ్తో దాంపత్యహక్కులను ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. దీనిపై వాదనలు విన్న కుటుంబ న్యాయస్థానం ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. చివరకు 2019 ఫిబ్రవరి 14న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. దీనిపై పై కోర్ట్లో అప్పీల్ చేస్తానంటూ.. మద్రాస్ హైకోర్ట్ మెట్లు ఎక్కింది.

సెల్వీ పిటిషన్పై మద్రాస్ హైకోర్ట్ సుదీర్ఘకాలంగా వాదనలు విన్నది. చివరకు కింది కోర్టు అయిన ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. కుటుంబ కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తూ... కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. పెళ్లికాకుండా సహజీవనం అనేది ఎంత కాలం పాటు చేసినా.. దాంపత్యహక్కులకు పొందేందుకు అర్హత సాధించదని పేర్కొంది. భారత రాజ్యాంగంలో పేర్కొన విధంగా కంజ్యూగల్ రైట్స్ వర్తించేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని పేర్కొంది. వాటి ప్రకారమే హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఇలాంటి కీలక తీర్పులను మద్రాస్ హైకోర్ట్ ఇప్పటికే చాలాసార్లు ఇచ్చింది. గతంలో ఓ అధికారి వేటుకు గురైనప్పుడు భార్య అతడిని చిత్రహింసలకు గురిచేసింది. ఈ నేపథ్యంలో పురుషులకు కూడా గృహహింస చట్టం వర్తింపచేయాలని పిటిషన్ ధాఖలు కాగా... విషయంలో ఈ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ నడిచింది. దీనికి సంబంధించి పలు మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. పురుషులు మాత్రం సోషల్ మీడియాలో అనందం వ్యక్తం చేశారు.