Begin typing your search above and press return to search.
కారుణ్య నియామకం ప్రసాదమో ,దానమో కాదు ..హక్కు !
By: Tupaki Desk | 28 Oct 2020 3:50 PM GMTఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు. ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడినా అదే పరిస్థితి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోడానికే కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టారు. మరణించిన లేక అనారోగ్య సమస్య వల్ల ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడిన ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే కారుణ్య నియామకాల లక్ష్యం. వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్‌మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు. అలాగే, కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు. జూనియర్ అసిస్టెంటు పోస్టులోగానీ, ఆ పోస్టు స్కేలుకు మించని పోస్టులోగానీ, అంతకన్నా తక్కువస్థాయి పోస్టులోగానీ నియమిస్తారు. ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులు నియామకం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. మైనర్ పిల్లల విషయంలో ఉద్యోగి మరణించిన రెండు సంవత్సరాలలోపు 18 సంవత్సరాలు వయసు నిండినపుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణలోకి తీసుకుంటారు.
అయితే , ఈ మధ్య కాలంలో కారుణ్య నియమాల విషయంలో అలసత్వం జరుగుతుంది. తాజాగా దీనిపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. bsnl లో పనిచేసే ప్రసన్న అనే ఉద్యోగి 2003 లో చనిపోయారు. అప్పట్నుంచి అతని కొడుకు ఆ ఉద్యోగం కోసం పోరాడుతున్నాడు. ఈ కేసు పై కోర్టు తుది తీర్పు వెల్లడిస్తూ .. సంపాదించే వ్యక్తి చనిపోతే , ఆ కుటుంబం పడే భాద వర్ణనాతీతం. కారుణ్య నియామకం అంటే ప్రసాదమో ,దానమో కాదు .. హక్కు అని చెప్పింది. అయితే , దేశంలో ఈ తరహా కేసులు ఎన్నో పెండింగ్ లో ఉండటం గమనార్హం.