Begin typing your search above and press return to search.
కోర్టు తీర్పుతో పళనిస్వామి పదవికి ముప్పేనా?
By: Tupaki Desk | 27 Feb 2017 3:43 PM GMTతమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే సమయంలో అన్నాడీఎంకే పార్టీ నేతల పళని స్వామి బలపరీక్షపై మద్రాస్ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పళనిస్వామి బలపరీక్ష చెల్లదంటూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. తమిళనాడు సీఎం పళనిస్వామి - స్పీకర్ - శాసనసభ కార్యదర్శి - సీఎస్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 10 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే బలమైన సాక్ష్యాలు ఉన్నాయంటున్న డీఎంకే పార్టీ ఈ మేరకు పళనిస్వామి పదవి ఊడటం ఖాయమని చెప్తోంది.
ఈ నెల 18న తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను పేర్కొంటూ బల పరీక్షను రద్దు చేయాలని స్టాలిన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రహస్య ఓటింగ్ ద్వారా బల పరీక్షను నిర్వహించేలా అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ కు కోర్టు ఆదేశాలివ్వాలని కోరారు. గవర్నర్ కార్యదర్శి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ఎన్నికల కమిషన్ కు చెందిన సీనియర్ అధికారులతో ఒక పర్వవేక్షణా కమిటీ వేసి దాని నేతృత్వంలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. అయితే బల పరీక్షను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు గత వారం తిరస్కరించిన సంగతి తెలిసిందే. కేసు తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. అసెంబ్లీలో 18న జరిగిన పరిణామాలకు సంబంధించి వీడియో ఫుటేజ్ లను తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది. తాజాగా ఈ తీర్ప ఇచ్చింది.
మరోవైపు హైకోర్టులో వేసిన తర్వాత స్టాలిన్ ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని , కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తమిళనాడు రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. సోనియాతో దాదాపు 25 నిముషాలు స్టాలిన్ భేటీ అయినట్లు డిఎంకె నేత ఒకరు తెలిపారు. వారిద్దరి మధ్య జరిగింది మర్యాదపూర్వకమైన సమావేశమేనన్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితిని స్టాలిన్ అడిగి తెలుసుకున్నానన్నారు. అలాగే కరుణానిధి ఆరోగ్యం గురించి సోనియా వాకబు చేసినట్లు చెప్పారు. తమిళనాడులోని రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగిందని ఆ నేత వెల్లడించారు. అయితే ఇది ఒక వ్యూహాత్మక భేటీ అని కూడా ఆయన చెప్పారు. డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత స్టాలిన్ మొదటిసారిగా ఢిల్లీ వెళ్లారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/