Begin typing your search above and press return to search.

అమ్మ ఆస్తులకు అధికారిక వారసుల్ని తేల్చేసిన మద్రాస్ హైకోర్టు

By:  Tupaki Desk   |   27 May 2020 12:45 PM GMT
అమ్మ ఆస్తులకు అధికారిక వారసుల్ని తేల్చేసిన మద్రాస్ హైకోర్టు
X
తమిళ ప్రజల మనసుల్లో అమ్మగా నిలిచిపోయి.. ఊహించని విధంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన పురుట్చితలైవి జయలలిత ఆస్తులకు చట్టబద్ధమైన వారసులు ఎవరన్నది తాజాగా మద్రాస్ హైకోర్టు తేల్చేసింది. గడిచిన కొద్దికాలంగా అమ్మ ఆస్తులకు వారసులు ఎవరన్న విషయంపై కోర్టులో కేసు నడుస్తోంది. తాజాగా విచారణను పూర్తి చేసిన మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును ప్రకటించింది.

అమ్మ అలియాస్ జయలలిత ఆస్తులకు ఆమె మేనకోడలు జే.దీపక్.. మేనకోడలు జే.దీపికను ప్రకటించింది. దీంతో.. అమ్మ ఆస్తులకు వారు అధికారిక వారసులు అయ్యారు. చెన్నైలోని పోయిస్ గార్డెన్ లోని వేదనిలయంలో కొంత భాగాన్ని అమ్మ స్మారకం గానూ.. మరికొంత భాగాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చాలని హైకోర్టు పేర్కొంది.

తామిచ్చిన సూచనకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేయటానికి ఎనిమిది వారాల గడువును ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టు జడ్జిలు ఎన్.కిరుబకరణ్.. జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్ తో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. తమను జయలలితకు అధికారిక వారసులుగా ప్రకటించాలని కోరిన దీప.. దీపక్ దాఖలు చేసిన పిటిషన్ కు ఓకే చేసింది. కోర్టు తీర్పుపై దీప ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన క్రెడిట్ మొత్తం తన సోదరుడేనని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. జయలలిత ఆస్తుల పరిరక్షణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా న్యాయవాది ఒకరు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి.. జయలలిత అసలు కుమార్తెను తానేనని గతంలో హడావుడి చేసిన.. మహిళ కోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తారో చూడాలి.