Begin typing your search above and press return to search.
మళ్లీ తెరపైకి నిత్యానంద.. రంజిత టేపులు
By: Tupaki Desk | 6 Sep 2017 7:51 AM GMTదేశ వ్యాప్తంగా కలకలం రేపిన అథ్యాత్మిక గురువు నిత్యానంద.. నటి రంజితల టేపుల వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోను ఓప్రైవేటు టీవీ ఛానల్ ప్రసారం చేయటం.. దానికి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరపాలంటూ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది.
నిత్యానంద ఆశ్రమంలో సేవకురాలిగా ఉన్న తనపై నిత్యానంద అత్యాచారానికి పాల్పడినట్లుగా మైసూర్ కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే.. ఐదేళ్ల పాటు తనపై నిత్యానంద శారీరక వేధింపులకు పాల్పడినట్లుగా అమెరికాకు చెందిన మహిళ గతంలో ఫిర్యాదు చేయటం.. దీనిపై నాటి కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ తీవ్రంగా స్పందించి నిత్యానందను అరెస్ట్ చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. అదే సమయంలో నిత్యానంద.. సినీ నటి రంజితలు సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావటం సంచలనం సృష్టించింది.
అయితే.. ఈ వీడియోను ప్రసారం చేసిన టీవీ ఛానళ్లకు వ్యతిరేకంగా చెన్నైకి చెందిన నిత్యానంద శిష్యుడు టీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ను తీసుకున్న పోలీసులు పలువురిని నిందితులుగా చేర్చారు. ఈ కేసు విచారణ చేసి సీబీసీఐడీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ విచారణ తుది దశకు చేరుకున్న వేళ.. నటి రంజిత మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తాను నిత్యనందతో చనువుగా ఉన్న వీడియోల వ్యవహారంపై మరోసారి విచారణ జరపాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన కోర్టు పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలంటూ సీబీసీఐడీని న్యాయమూర్తి ఆదేశించారు.