Begin typing your search above and press return to search.
ఆనందయ్యకు మద్రాస్ హైకోర్టు సలాం
By: Tupaki Desk | 26 Jun 2021 2:30 AM GMTకరోనా కల్లోలంలో ఏమందు లేక అలమటిస్తున్న జనాలకు ఆనందయ్య ఆయుర్వేద మందుతో ముందుకొచ్చాడు. అది కరోనాను తగ్గిస్తుందన్న ప్రచారం మొదలు కావడంతో డిమాండ్ ఎక్కువైంది. ఏపీ, కేంద్ర మంత్రిత్వశాఖల పరిశీలన తర్వాత మందుకు అధికారికంగా పంపిణీకి ప్రభుత్వం అనుమతించింది.
సెకండ్ వేవ్ వేళ ఆనందయ్య నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో తయారు చేస్తున్న కరోనా మందుకు ఇప్పుడు జనాలు క్యూ కడుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తీసుకెళుతున్నారు.
తాజాగా ఆనందయ్య కరోనా నివారణ మందుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాకు మందు తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది. ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ కరుబాకరణ్, టీవీ తమిళ్ సెల్వీ సెల్యూట్ చేశారు.
మద్రాస్ హైకోర్టులో డీఆర్డీఏ తయారు చేసిన 2డీజీ మందుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలోనే ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ఆనందయ్యపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు అభినందనల వర్షం కురిపించారు. ఆయుర్వేద వైద్యులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.