Begin typing your search above and press return to search.
అమ్మ..అమృత కేసులో నాన్న ఏరి? అన్న కోర్టు!
By: Tupaki Desk | 23 Dec 2017 4:28 AM GMTఅమ్మ.. అమృత అన్నట్లుగా సాగుతున్న కేసు ముచ్చట ఏంటో గుర్తుకు వచ్చిందా? అదేనండి.. అమ్మ జయలలిత మరణం తర్వాత.. అమృత అనేఅమ్మాయి తెర మీదకు రావటం.. తాను అమ్మ కూతుర్ని అని.. తనను జయ వారసురాలిగా గుర్తించాలంటూ మీడియా.. కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా అవివాహితగానే మిగిలిన అమ్మ జయలలితకు నాటి హీరో శోభన్ బాబుతో ఉన్న ప్రేమానుబంధం కారణంగా అమృత జన్మించిందన్నది వాదన.
దీనిపై సుప్రీం వరకు వెళ్లినా.. ముందు హైకోర్టులో లెక్క తేల్చుకోమంది. దీంతో.. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. తాజాగా జరిగిన విచారణలో ఈ కేసుపై కోర్టు ఆసక్తికర వ్యాఖ్య పేర్కొంది. జయలలితను అమ్మగా చెబుతున్నారు సరే.. మరి తండ్రిగా శోభన్ బాబు పేరును పిటిషన్లో ఎందుకు పేర్కొనలేదో చెప్పాలని కోర్టు క్వశ్చన్ చేసింది.
తండ్రిగా శోభన్ బాబు నుంచి రావాల్సిన హక్కుల గురించి ఎందుకు అడగటం లేదో చెప్పాలని కోరింది. తాము ఎప్పిన అంశాల్ని పిటిషన్లో మార్పులు చేసి కోర్టుకు దాఖలు చేయాలని అమృత తరఫు న్యాయవాదికి సూచన చేసింది. దీంతో.. న్యాయవాది మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే.. అమృత పిటిషన్ విచారణకు అర్హమైనది కాదంటూ అడ్వొకేట్ జనరల్ విజయనారాయణ్ కోరారు. అయితే.. ఆయన వాదనను పరిగణలోకి తీసుకోని కోర్టు.. అమృత పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని.. అఫిడవిట్ లు సబ్ మిట్ చేయాలని రాష్ట్ర సర్కారుకు.. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి.. చెన్నై కార్పొరేషన్ కమిషనర్ కు.. జయ మేనకోడలు దీప.. ఆయన సోదరుడు దీపక్ కు నోటీసులు జారీ చేశారు. మొత్తానికి ఎవరో వేసిన పిటిషన్ కు సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో మిగిలిన వారు ఇప్పుడు చేరారు. మరి.. కోర్టు పంపిన నోటీసులపై వారు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పకతప్పదు.