Begin typing your search above and press return to search.

టీనేజర్లు రిలేషన్ షిఫ్ లో ఉంటే.. మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   1 Feb 2021 12:30 AM GMT
టీనేజర్లు రిలేషన్ షిఫ్ లో ఉంటే.. మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు
X
బాలికలు.. మైనర్లపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులు దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారటమే కాదు.. వివాదాస్పదంగా మారాయి. చివరకు ఈ తీర్పులు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై సుప్రీం సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల విషయంలో బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యల తీరు ఇలా ఉంటే.. తాజాగా మద్రాస్ హైకోర్టు టీనేజర్లపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి సంచలన తీర్పును ఇచ్చింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న పోక్సో చట్టాన్ని కొంత మార్పులు చేయాలన్న సూచన చేసింది. అసలేం జరిగిందంటే..

పాతికేళ్ల వయసున్న ఆటో డ్రైవర్ ఒకరు మైనర్ బాలికను 2018లో పెళ్లాడారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ కుర్రాడిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. దీనికి సంబంధించిన కేసు విచారణ మద్రాస్ హైకోర్టు ముందుకు వచ్చింది. వాదనల సమయంలో.. బాధితురాలిగా పేర్కొనే టీనేజర్ తన అభిప్రాయాన్నిచెబుతూ.. తనకు ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నానని.. ఎలాంటి బలవంతం లేదన్నారు. తామిద్దరం ప్రేమించుకున్నట్లు ఆ అమ్మాయి చెప్పింది.
అయినప్పటికి తన తల్లిదండ్రులు కేసులు పెట్టి తమను వేధిస్తున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి తమపై ఉన్న కేసుల్ని కొట్టేయాలని హైకోర్టును వేడుకుంది. దీంతో ఆ అమ్మాయి వాదనను పరిగణలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును ప్రకటించారు. రిలేషన్ లో ఉన్న టీనేజర్లపై పోక్సో చట్టం కింద కేసులు సరికావన్నారు. వారిద్దరూ ఇష్టపడే రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నప్పుడు వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. దీంతో.. ఫోక్సో చట్టాల్లో కొత్తగా కొన్ని నిబంధనలు చేర్చాల్సిన అవసరం ఉందని.. అందుకు చట్టసభలు పరిశీలన చేయాలని న్యాయమూర్తి సూచన చేశారు.