Begin typing your search above and press return to search.
తాజా తీర్పుతో తమిళనాడులో ఎన్నికల సందడి షురూ!
By: Tupaki Desk | 25 Oct 2018 8:44 AM GMTకేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో షెడ్యూల్ కంటే ముందుగా ఎన్నికల వేడి రెండు తెలుగు రాష్ట్రాలకు పట్టేసింది. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏపీతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ.. ఎన్నికల తుది ఫలితం మీద రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల్లో విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. దీంతో.. ఏపీలో ఎలాంటి ఎన్నికలు లేకున్నా.. ఎన్నికల హడావుడి అంతో ఇంతో ఏపీలో కనిపిస్తున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తమిళనాడులో ఎన్నికల హడావుడి త్వరలో షురూ కావటం ఖాయమని చెప్పాలి. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత కేసులో పళనిస్వామి ప్రభుత్వానికి ఊరట కలిగేలా తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది.
గత ఏడాది 18 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై వేటు పడిన సదరు ఎమ్మెల్యేలు హైకోర్టులో న్యాయపోరాటం చేయగా..ఇద్దరు న్యాయమూర్తులున్న బెంచ్ తీర్పు భిన్నంగా రావటంతో (ఒకరు సమర్థిస్తూ.. మరొకరు వ్యతిరేకిస్తూ) మూడో న్యాయమూర్తి దృష్టిని ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. తాజాగా సదరు న్యాయమూర్తి తీర్పునిస్తూ.. స్పీకర్ ఇచ్చిన తీర్పును తాము సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో.. 18 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు అభ్యర్థులపై వేసిన అనర్హత వేటు అమల్లోకి వచ్చినట్లైంది.
తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న దినకరన్ స్వాగతించారు. తాజా తీర్పు నేపథ్యంలో పళని సర్కారుకు ఊరట లభించినట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. 232 మంది ఉన్న తమిళనాడు ఎమ్మెల్యేల సంఖ్య తాజా తీర్పుతో 213కు పడిపోయింది. ప్రస్తుతం అసెంబ్లీలో పళని సర్కారుకు 110 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో.. ఉప ఎన్నికలుజరిగే వరకూ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేని పరిస్థితి.
కోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్నెల్ల వ్యవధిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.అందులో సీట్లు ఏ పార్టీ ఎక్కువ సాధిస్తే.. దానికి తగ్గట్లు రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో 18 స్థానాల్లో ఉప ఎన్నికలంటే.. ఒక రకంగా తమిళనాడులోనూ ఎన్నికల ఫీవర్ షురూ అయినట్లేనని చెప్పక తప్పదు.