Begin typing your search above and press return to search.
మనసున్న మాఫియా: ఇటలీలో పేదలకు సహాయం
By: Tupaki Desk | 11 April 2020 6:00 AM GMTకరోనా వైరస్‌ను అంచనా వేయడంలో విఫలమై.. ముందే అప్రమత్తం కాకపోవడంతో ఇటలీ దేశం మూల్యం చెల్లించుకుంటోంది. ఆ వైరస్ బారిన పడిన దేశాల్లో అత్యధికంగా నష్టపోతున్నది ఇటలీ. ఈ దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండగా, దాదాపు 18,279 మరణాలు సంభవించాయి. కరోనా కేసుల్లో టాప్-5లో ఉండగా మృతుల్లో మాత్రం ప్రథమస్థానంలో ఇటలీ నిలిచింది. ఈ సమయంలో ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. ప్రస్తుతం ఆ దేశం చిగురుటాకులా వణుకుతోంది. దీంతో ప్రజలు దినదిన గండంగా బతుకీడుస్తున్నారు. ఈ సమయంలో కఠినంగా వ్యవహిరించే మాఫియా ముఠాలు పేదలకు అండగా నిలుస్తున్నాయి. కొన్ని వారాలుగా డబ్బులు లేకుండా దిగ్బంధంలో ఉన్న పేద కుటుంబాలకు ఆ ముఠాలు సహాయం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పేదలకు అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయని ఆ దేశ మీడియాలు చెబుతున్నాయి. ఈ ముఠాలు కాంపానియా, కాలాబ్రియా, సిసిలీ, పుగులియాలోని దక్షిణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు మాఫియా ముఠాలు సహాయం చేస్తున్నాయంట.
ఇటలీలో నెల రోజులకుపైగా దుకాణాలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, పబ్బులు మూతపడ్డాయి. దీంతో ఆ దేశ ప్రజలు ఉపాధి కోల్పోయారు. ఇంటికే పరిమితమై దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. మిలియన్ల మంది ప్రజలకు నెలకు పైగా ఆదాయం రాలేదు. ప్రజలకు మద్దతుగా ప్రభుత్వం షాపింగ్ వోచర్లు జారీ చేసింది. అయినా పేదలకు సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల పేదల జీవితాలను చూసిన మాఫియా ముఠాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి.
దక్షిణ ప్రాంతంలో మాఫియా పెరుగుతున్న పేదరికాన్ని చూసి సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి. నేపుల్స్ లో కామోరా, నియాపోలిటన్ వంటి సమూహాలకు చెందిన ముఠాలు ప్రజలకు ఆహార పొట్లాలను ఇంటింటికి అందిస్తున్నారు. పలెర్మోల్ లో కోసా నోస్ట్రా నాయకుడి సోదరుడు పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ ముఠాలు చేసే సహాయాన్ని ప్రభుత్వం, పలు సంస్థలు తప్పు పడుతున్నాయి. పేదలకు సహాయం పేరిట మాఫియా ముఠాలు తమ సామ్రాజ్యం పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని చెబుతున్నాయి. మాఫియా చేస్తున్న కార్యక్రమాలను పోలీసుల నిఘా పడింది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో మాఫియా అక్కడి ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి, ఆ భూభాగాలు, మార్కెట్లను పరిపాలించాలని కోరుకుంటాయని ఆ దేశంలోని మంత్రులు చెబుతున్నారు.
మాఫియాలు ఇచ్చేవి బహుమతులు కావని, మాఫియా దయార్థ హృదయంతో ఏమీ పని చేయవని అక్కడి ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. లాక్డౌన్ సమయంలో మాఫియాకు చెందిన వారు తమ వద్ద ఉన్న నగదును అవసరమైన వ్యాపారాలకు అందించి ఆ తర్వాత మనీలాండరింగ్ కోసం ఆ వ్యాపారాలను ఉపయోగించుకుంటారని ఆ దేశ పోలీస్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం, పోలీసులు ఎంత తప్పుబట్టిన మాత్రం ప్రజలు మాఫియా ముఠాలు చేసే కార్యక్రమాలను చూసి హర్షిస్తున్నారు. మానవతా దృక్పథంతో పని చేసే వారిని ప్రోత్సహించాలని, అంతేకానీ ఇలా తప్పుబట్టడం సరికాదని పేర్కొంటున్నారు.