Begin typing your search above and press return to search.
ప్రత్తిపాటి ఇంటి పేరు మార్చేస్తానన్న ఎంపీ
By: Tupaki Desk | 20 Jan 2017 11:55 AM GMTఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు పేరులోనే పంటలకు సంబంధించిన పదాలున్నాయి.. ఆయన ఇంటి పేరు ప్రత్తిపాటి. అయితే...ఆయన్ను ప్రత్తిపాటి పుల్లారావు అని కాకుండా పొగాకు పుల్లారావు అని పిలుస్తామని టీడీపీ ఎంపీ ఒకరు ప్రతిపాదించారు. కానీ, అందుకు ఆయన ఒక షరతు కూడా పెట్టారు. పొగాకు రైతులకు గిట్టుబాట ధర కల్పించే బాధ్యతను వ్యవసాయ మంత్రి భుజానికెత్తుకోవాలని, రైతులకు న్యాయం చేస్తే అందుకు గుర్తుగా ఆయన్ను పొగాకు పుల్లారావు అని పిలుచుకుంటామని ఎంపీ మాగంటి బాబు అన్నారు.
విజయవాడలో పొగాకు రైతులకు అవార్డులు ప్రదానం చేసేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రితో పాటు మాగంటి బాబు కూడా పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్లినా సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్వించే అలవాటున్న మాగంటి బాబు మైకు అందుకుని పొగాకు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. పొగాకు రైతులకు ధర గిట్టుబాటు కావడం లేదని.. వారికి గిట్టుబాటు ధర కల్పిస్తే మంత్రిని ఇక నుంచి పొగాకు పుల్లారావు అని పిలుస్తామని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
అనంతరం మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ, తాను కూడా పొగాకు రైతునేనని, పొగాకు రైతుల సమస్యలు తనకు తెలుసని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, పొగాకు రైతులకు రూ.2 వేలు బోనస్ ఇస్తున్నామని చెప్పారు. అమరావతిలో రైతు భవనం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరి మాగంటి బాబు మాట ప్రకారం పుల్లారావు తన ఇంటి పేరులోని పంటను మార్చుకుంటారో లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/