Begin typing your search above and press return to search.
మాగంటి మాటలకు అర్ధాలు వేరులే!!
By: Tupaki Desk | 12 May 2017 6:56 AM GMTటీడీపీ ఎంపీ మాగంటి బాబు వ్యవహార శైలిపై ఆ పార్టీలో ఇటీవల అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆయన సీఎం చంద్రబాబు పర్యటనల్లోనూ కనిపించకపోవడం... పార్టీలో ఏమాత్రం యాక్టివ్ గా లేకపోవడంతో ఆయన వైపు ఇతర టీడీపీ నేతలు అనుమానంగా చూస్తున్నారు. ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కూడా మొదలైంది. బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ముసురుకుంటున్నాయి. మరోవైపు వైసీపీలో చేరుతారంటూ ఓ వర్గం ప్రచారం చేస్తోంది.
కాగా మాగంటి బాబు గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో ఆయన తన నియోజకవర్గంలో జరిగిన ఓ టీడీపీ కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వచ్చేశారు కూడా. చాలాకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సీఎం తనను పట్టించుకోవడం లేదంటూ పలుమార్లు అనుచరుల వద్ద అన్నట్లు చెబుతున్నారు.
అయితే మాగంటి బాబు మాత్రం అదేమీ లేదంటున్నారు. చంద్రబాబుపై తనకు ఏమాత్రం కోపం లేదని తాజాగా చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనలకు కూడా తాను హాజరుకావడం లేదన్న వార్తల్లో కూడా వాస్తవం లేదని ఆయన తెలిపారు. స్థానిక నేతలకు కూడా అవకాశం కల్పించాలనేదే తన ఆలోచన అని... అందుకే తాను వేదిక ఎక్కడం లేదని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలతో సైతం తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అయినా, ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు ఉండటం సహజమేనని చెప్పారు. డబ్బు ఖర్చు చేసే తాము ఎన్నికల్లో గెలిచామని అన్నారు. పోలవరం భూసేకరణలో గతంలో అవకతవకలు చోటుచేసుకున్న విషయం వాస్తవమని మరోసారి ఆయన కుండబద్ధలు కొట్టారు. అయితే... మాగంటి తాజా ప్రకటన చూసినవారంతా మాటలకు చేతలకు తేడా ఉంటుందని... ఆయన పార్టీలో ఇమడలేకపోతున్నారన్నది వాస్తవమని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/