Begin typing your search above and press return to search.
బీజేపీలోకి వెళ్లమంటున్న టీడీపీ ఎంపీ
By: Tupaki Desk | 14 Aug 2015 5:26 AM GMTఆయనో టీడీపీ ఎంపీ..కానీ టీడీపీ కార్యకర్తలను ఉంటే టీడీపీలో ఉండండి..లేకుంటే బీజేపీలోకి వెళ్లండని చెప్పడంతో అక్కడున్న టీడీపీ కార్యకర్తలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏలూరు నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న మాగంటి బాబు కృష్ణాజిల్లా కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో పర్యటించారు. కైకలూరుతో బాబుకు ఎక్కువ అనుబంధం ఉంది. అక్కడ నుంచి బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రాథినిత్యం వహిస్తున్నారు.
తాజాగా కైకలూరులో పర్యటించిన బాబు మాట్లాడుతూ తాను, మంత్రి కామినేని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని..అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా ఎవ్వరు ప్రకటనలు చేయవద్దని ఆయన టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అంతటితో ఆగకుండా మీరు ఉంటే టీడీపీలో ఉండండి..లేకుంటే బీజేపీలోకి వెళ్లినా ఓకే...అంతేకాని వైకాపాలోకి మాత్రం వెళ్లవద్దని వారికి సలహా ఇచ్చారు.
కొల్లేరు మిగులు భూములు 700 ఎకరాలు పంపిణీ చేసేందుకు కూడా సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నారని బాబు చెప్పారు. బాబు మాటలతో విస్తుపోయిన టీడీపీ కార్యకర్తలు పొత్తులో భాగంగా బీజేపీతో కలిసి పనిచేయాలని కోరడంలో తప్పులేదని కాని..టీడీపీ కార్యకర్తలను బీజేపీలోకి వెళ్లమని ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి చెప్పడం ఏంటని వారు ఆయన తీరును తప్పుపడుతున్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాబు ఈ వ్యాఖ్యలు చేశారా..ఆయన చూపు ఏమైనా బీజేపీ వైపు ఉందా లేదా కాకతాళీయంగానే అలా అన్నారా అని అక్కడ చర్చలు జరుగుతున్నాయి.