Begin typing your search above and press return to search.
అక్కడ బాబు..ఇక్కడ కేసీఆర్ వుండాలంట
By: Tupaki Desk | 11 March 2016 1:15 PM GMTఏపీలో చంద్రబాబు.. తెలంగాణాలో కేసీఆర్ ముఖ్యమంత్రులుగా వుంటేనే... రెండు తెలుగు రాష్ట్రాలు అభివృధ్ధిపథం వైపు దూసుకెళతాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంటున్నాడు. అంతేకాదు... అక్కడ చంద్రబాబు ఓ 15ఏళ్లు..ఇక్కడ కేసీఆర్ ఓ 15ఏళ్లు ముఖ్యమంత్రిగా వుండాలని కూడా చెబుతున్నాడు. తాను తెరాసలో చేరినా... తెలుగుదేశం పార్టీలో వున్నట్టే వుందని.. టీఆర్ ఎస్ అంటే టీడీపీనే అనే కొత్త భాష్యం చెప్పాడు. తాను అలా ఎందుకు అంటున్నాడనేది కూడా చెప్పాడు. తెరాస అధినేత కేసీఆర్ ఒకప్పుడు తెలుగుదేశంలో కీలకనేత అని, తన కుమారిని పేరు తారక రామారావు అని, ప్రస్తుతం వున్న మంత్రుల్లో దాదాపు 80 శాతం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారేనని కలరింగ్ ఇస్తున్నాడు.
ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు మాగంటి గోపీనాథ్. అంతేనా.. నీకు తెరాస నాయకుల నుంచి ఎలాంటి ఆఫర్లు వచ్చాయంటే... నా నియోజకవర్గం అభివృద్ధికి కేసీఆర్ సహకరిస్తానని చెప్పాడని అంటున్నాడు. తాను 1985లోనే హైదరాబాద్ లో తెలుగుయువత అధ్యక్షుడిగా చేశానని, పదవులు తనకు కొత్తేమీ కాదన్నారు. అలాగే దాదాపు 35 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేను అయ్యే అవకాశం తన నియోజకవర్గ ప్రజలు ఇచ్చారని, వారి అభివృద్ధి కోసం తాను పార్టీ మారాల్సి వచ్చిందని కూడా చెబుతున్నాడు. మరి ఈ మాటలు విన్న తెరాస, టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.