Begin typing your search above and press return to search.
రాందేవ్ నూడుల్స్ కోసం మ్యాగీకి రాంరాం
By: Tupaki Desk | 14 Nov 2015 6:29 AM GMTమ్యాగీ నూడుల్స్ ను నిషేధించినప్పుడు ఆ నిర్ణయం వెనుక కుట్ర ఉందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కాని ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బాంబే హైకోర్టు సూచనల మేరకు కొత్త ప్రమాణాలతో తయారుచేసిన కొత్త మ్యాగీ నూడుల్స్ ను కోర్టు చెప్పిన పరీక్ష కేంద్రాలలో టెస్ట్ చేశారు. తీరి అన్ని ల్యాబ్ లోనూ పరీక్షలు కంపెనీకి అనుకూలంగా రావడంతో హైకోర్టు కూడా వాటిని మార్కెట్ లోకి విడుదల చేనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే ఈ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని శాంపిల్స్ ని ల్యాబ్ లో పరీక్షిస్తే అక్కడా మ్యాగీకి అనుకూలంగానే ఫలితాలు వచ్చాయట...కానీ,శాంపిల్స్ లో కాకుండా ఇతర ప్యాకెట్లలో లోపాలు ఉండొచ్చు కదా అని మహారాష్ట్ర ఆహర - పౌర సరఫరాల శాఖ మంత్రి గిరీష్ బాపట్ విచిత్ర వాదన వినిపిస్తున్నారు. అయితే... మ్యాగీని నిషేధించినప్పుడు కొన్ని ప్యాకెట్లు మాత్రమే పరీక్షించి మొత్తం మ్యాగీ నూడుల్స్ ను నిషేధించిన విషయం మాత్రం ఆయన మర్చిపోతున్నారు. మరి మంత్రి గారి మాట ప్రకారం తయారు చేసే ప్రతి ప్యాకెట్ ను పరీక్షించే విధానం ఒక్క మ్యాగీ నూడుల్స్ కేనా మిగిలిన ఉత్పత్తులకు కూడా వర్తిస్తాయా ? అసలు ఇది సాధ్యమైయ్యే పనేన ? అన్నది వారే ఆలోచించుకోవాలి.
అయితే... మాహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన వెనుక అసలు కారణం వేరని తెలుస్తోంది. త్వరలోనే మార్కెట్ లోకి రానున్న బాబా రాందేవ్ నూడుల్స్ కోసం మ్యాగీని నిషేధాన్ని పొడిగిస్తున్నారా అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. తమ నూడుల్స్ మార్కెటింగ్ కోసం బాబా రాందేవ్ కంపెనీ ఫ్యూచరస్ రీటైల్ లో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.. తెలుగు రాష్ట్రాలు కూడా మ్యాగీ నూడుల్స్ పై ఇంకా నిషేధం ఎత్తేయకపోవడానికి కారణం ఇదేనని వినిపిస్తోంది. ఏపీ,తెలంగాణలతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ మ్యాగీపై నిషేధం కొనసాగుతోంది. రాందేవ్ బాబా నూడుల్స్ మార్కెట్లో కుదురుకున్నాక గానీ మ్యాగీకి చెర వీడేలాలేదు.