Begin typing your search above and press return to search.
మ్యాగీ మంచిదే...
By: Tupaki Desk | 17 Oct 2015 3:54 AM GMTమ్యాగీ నూడిల్స్...కొన్నినెలల క్రితం వరకు ఈ ఉత్పత్తి అందరికీ పాపులర్. ఆ తర్వాత కూడా అంతే పాపులర్ అయింది. అయితే **మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల సంస్థ వెల్లడించింది.దీంతో నిషేధించాం** అనే నెగెటివ్ ప్రచారంతో జనాల్లోకి వెళ్లింది. అలాంటి నెస్లే మ్యాగీకి ఇపుడు మంచిరోజులు వచ్చాయి. నెస్లే మ్యాగీ మంచిదేనని పరీక్షల్లో తేలింది. మ్యాగీపై దుమారం రేగిన నేపథ్యంలో 100 మ్యాగీ శాంపిల్స్ ను హైదరాబాద్ - జైపూర్ - పంజాబ్ లోని ఆహార పరీక్ష కేంద్రాల్లో పరీక్షించగా అవి సురక్షితమని పరీక్షల్లో తేలినట్టు నెస్లె ఇండియా సంస్థ ప్రకటించింది.
మ్యాగీపై దుమారం రేగిన నిషేధం విధించిన సమయంలో బాంబే హైకోర్టులో కేసు నమోదు అయింది. విచారణ చేసిన కోర్టు నిషేధాన్ని ఇటీవల ఎత్తేసింది. అయితే మూడు ప్రభుత్వ రంగ ల్యాబరేటరీలలో మ్యాగీని పరీక్షించాలని మ్యాగీలో రసాయనాలు అనుమతించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలితేనే ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు మూడు ల్యాబరేటరీల్లో శాంపిల్స్ ను పరీక్షించారు. మ్యాగీలో రసాయనాలను మోతాదుకు లోపే వాడినట్టు పరీక్షల్లో తేలిందని, నివేదికల ఫలితాలు తమకు అందాయని నెస్లె సంస్థ ప్రకటించిందని వివరించింది. ఈ నేపథ్యంలో త్వరలో తాము మార్కెట్ లో మళ్లీ ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇకనుంచి భారత ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం నడుచుకుంటామని ఆ సంస్థ ముందే వెల్లడించింది.