Begin typing your search above and press return to search.
రష్యా - జపాన్ లలో భూకంపం..సునామీ వార్నింగ్
By: Tupaki Desk | 25 March 2020 9:00 AM GMTకరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గజగజా వణికిపోతున్నాయి. కరోనా పుట్టినిల్లయిన చైనా....ఆ మహమ్మారి బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇటువంటి తరుణంలో హంటా వైరస్ బారిన పడి ఒక వ్యక్తి మరణించడం..మరో 32 మంది క్వారంటైన్ లోకి వెళ్లడంతో చైనా కలవరపడుతోంది. కరోనాబారి నుంచి ఎలా తప్పించుకోవాలిరా దేవుడా అంటూ చిగురుటాకులా వణికిపోతున్న రష్యా, జపాన్, హవాయ్ ల పై మరో ప్రళయం విరుచుకుపడింది. ఈ దేశాలలో భూకంపం సంభవించడంతో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి పసిఫిక్ మహా సముద్రంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఆ తర్వాత అంత తీవ్రత లేకపోవడంతో శాస్త్రవేత్తలు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. రష్యా కాలమానం ప్రకారం రష్యాలోని కురిల్ ఐలండ్స్ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర గర్భంలో భారీ ప్రకంపనలు వచ్చాయని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
జపాన్‌లోని సప్పొరొ నగరానికి ఈశాన్య భాగంలో 1400 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్ర గర్భంలో 59 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. తొలుత సునామీ వస్తుందని భావించిన శాస్త్రవేత్తలు..ఆ తర్వాత 0.3 మీటర్ల ఎత్తు వరకే అలలు ఎగిసిపడడంతో సునామీ హెచ్చరికలు ఉపసంహరించుకున్నారు. అసలే కరోనా దెబ్బకు భయాందోళనలో ఉన్న రష్యా, జపాన్, హవాయ్ ప్రజలు...సునామీ వార్నింగ్ తో చిగురుటాకులా వణికిపోయారు. సునామీ సమాచారం అందిన వెంటనే కురిల్ ఐలండ్స్, సప్పొరో తీర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.హవాయ్ ద్వీప ప్రజలు తీర ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు. సునామీ వచ్చే సూచనలు తగ్గిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పసిఫిక్ మహాసముద్రం జోన్ పరిధిలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడం 2006 తరువాత ఇదే తొలిసారి. 2006లో ఇదే జోన్‌లో 8.3 తీవ్రతతో పెనుభూకంపం సంభవించింది.