Begin typing your search above and press return to search.

పవన్ తో ఫైట్ తర్వాత మూర్తికి కొత్త జాబ్

By:  Tupaki Desk   |   23 Sep 2018 5:30 AM GMT
పవన్ తో ఫైట్ తర్వాత మూర్తికి కొత్త జాబ్
X
పవన్ కళ్యాణ్ విరాళాల వసూళ్ల పై స్ట్రింగ్ ఆపరేషన్ చేయించిన జర్నలిస్టు మూర్తి పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో తను పనిచేస్తున్న మహా న్యూస్ యాజమాన్యంతో గొడవల కారణంగా ఆ సంస్థకు రాజీనామా చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో మూర్తి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. మూర్తికి ప్రస్తుతం కొత్త జాబ్ దొరికిందని సమాచారం.

మూర్తి తాజాగా టీవీ5లో జాయిన్ అయినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయనకు టీవీ5లో జాబ్ ఇచ్చారు. కానీ దాన్ని అధికారికంగా ఇప్పటివరకూ రిలీవ్ చేయలేదు. మహాన్యూస్ లో సీఈవో - ఎడిటర్ గా ఉన్న ఆయనకు టీవీ5లో ఏ పదవి ఇచ్చారన్నది బయటకు పొక్కలేదు.

పవన్ కళ్యాణ్ తన కాపు సామాజికవర్గ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ‘రహస్య సమావేశాన్ని’ మూర్తి స్వయంగా మారువేశంలో వెళ్లి సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించినట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఈ కథనం ప్రసారం చేశాక మహాన్యూస్ యాజమాన్యం కథనాలను ఆపు చేసిందని మూర్తి ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు. దీనిపై తాను అభ్యంతరం తెలిపానని వివరించాడు. తాను కష్టపడి తీసుకొచ్చిన కథనాలు ఆపుచేస్తారా అని యాజమాన్యంతో గొడవకు దిగినట్టు పేర్కొన్నాడు. దీంతో అనవసరంగా కిందిస్థాయి ఉద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం ఇష్టంలేక తనే రాజీనామా చేసి వెళ్లిపోయానని వివరించాడు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా పక్కాగా సీక్రెట్ ఆపరేషన్ ను నిర్వహించి ప్రసారం చేశానని తెలిపారు.

అయితే మూర్తి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పై స్ట్రింగ్ ఆపరేషన్ ప్రసారం చేసి ఇరుకున పెట్టాడో అప్పుడే పవన్ అభిమానులు మూర్తిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు చేశారు. కొందరు బయటి వ్యక్తులు - నాయకుల నుంచి కూడా మహాన్యూస్ యాజమాన్యంపై ఒత్తిడి వచ్చినట్టు వార్తలొచ్చాయి. దీంతో చానెల్ కు ఈ పరిణామాలు ఇబ్బందిగా అనిపించడంతో మూర్తి స్ట్రింగ్ ఆపరేషన్ ను ప్రసారం కాకుండా ఆపుచేశారు. దీనికి నొచ్చుకున్న మూర్తి ఏకంగా చానెల్ కే రాజీనామా చేసి వెళ్లిపోయారు.

మరి ఈ కొత్త జాబ్ లో మూర్తి అంతే అగ్రెసివ్ గా ముందుకెళుతాడో.. ఈ దెబ్బకు ఏమైనా తగ్గుతాడా అనేది వేచి చూడాలి.