Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ దొంగ..బీజేపీ గజదొంగ అంటున్న హార్దిక్
By: Tupaki Desk | 24 Oct 2017 9:49 AM GMTకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ తో రహస్యంగా సమావేశమయ్యారనే వార్త గుజరాత్ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు దారితీస్తోంది. గుజరాత్‌లో రోడ్ షో - బహిరంగ సభలకు వచ్చి రాహుల్ ను అహ్మదాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో హార్దిక్ పటేల్ రహస్యంగా కలిశారని హోటల్ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటు పటేల్ అటు - బీజేపీ నేతలు స్పందించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలు తీవ్రంగా స్పందించాయి.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో తాను సమావేశం కాలేదని హార్దిక్ పటేల్ అన్నారు. ఒకవేళ రాహుల్ ను కలవాల్సి వస్తే బహిరంగంగానే కలుస్తానని ఆయన అన్నారు. కాగా, రాహుల్ గాంధీ బస చేసిన హొటల్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ లో హార్దిక్ పటేల్ రాహుల్ వద్దకు వెళ్లినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన రాహుల్ ను తాను కలవలేదని చెప్పారు. కాంగ్రెస్ ఆహ్వానం మేరకు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు తాను హోటల్ కు వెళ్లానని, అయితే, ఆలస్యం అవుతుండటంతో తాను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ అశోక్ గెహ్లాట్ ను మాత్రమే కలిసి వెనుకకు వచ్చానని చెప్పారు. బీజేపీ ఓడించడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. తన వాదనను సమర్థించుకుంటూ...బీజేపీ 'గజదొంగ' (మహాచోర్).. కాంగ్రెస్ 'దొంగ' (చోర్).. గజదొంగను ఓడించడానికి దొంగకు మద్దతిస్తే తప్పేంటని పాటిదార్ ఉద్యమ నేత ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ లాగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తానేమీ కలువలేదని హార్థిక్ ఎద్దేవా చేశారు.
మరోవైపు బీజేపీ సైతం ఈ పరిణామాలపై ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ తన అవసరాల కోసం ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను కూడా ఆహ్వానిస్తుందని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అన్నారు. రాహుల్-హార్దిక్ పటేల్ వార్తల నేపథ్యంలో నితిన్ పటేల్ పైవిధంగా స్పందించారు. గుజరాత్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం కోసం హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాలు పంపుతుందని నితిన్ పటేల్ అన్నారు. రాహుల్ గాంధీతో హార్దిక్ పటేల్ సమావేశమయ్యారని, వారు సుమారు 40 నిముషాల పాటు చర్చలు జరిపారని వార్తలు వెలువడ్డాయని అయినప్పటికీ...ఇరు పక్షాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.