Begin typing your search above and press return to search.
మరో ఘోరం: పట్టాలు తప్పిన ‘మహా కోశల్’ రైలు
By: Tupaki Desk | 30 March 2017 4:45 AM GMTఇటీవల కాలంలో రైళ్ల ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి దుర్ఘటనే మరొకటి చోటు చేసుకుంది. యూపీలో పట్టాలు తప్పిన రైలు ప్రమాదం భారీ నష్టాన్నికలుగజేస్తుందని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందని ఈ దుర్ఘటన విషాదంలోకి వెళితే.. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం 8 బోగీలు పట్టాలు తప్పినట్లుగా చెబుతున్నారు.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ)కి వెళ్లే మహాకోశల్ ఎక్స్ ప్రెస్ గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైనట్లుగా చెబుతున్నారు. యూపీలోని కుల్ పహాడ్ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈప్రమాదంలో మొత్తం 8 బోగీలు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. పట్టాలు తప్పిన 8 బోగీలు.. ఒకపక్కకు ఒరిగిపోయాయని చెబుతున్నారు.
ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం ఎంత జరిగిందన్నవివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల్లో ఉగ్రవాదుల హస్తం ఉందన్న విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో.. మహా కోశల్ ప్రమాదం కూడా ఆ కోవకు చెందినదేనా అన్నది ఇప్పుడు ప్రశ్నగామారింది.దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/