Begin typing your search above and press return to search.
ఈ ‘మోడీ’ రైలు చాలా డిఫరెంట్ గురూ
By: Tupaki Desk | 23 Jan 2016 9:52 AM ISTప్రధాని నరేంద్రమోడీ ఒక రైలును ప్రారంభించారు. కొత్త రైళ్లను షురూ చేయటం మామూలే. కానీ.. తాజాగా మోడీ పచ్చ జెండా ఊపిన ‘‘మహామనా’ ఎక్స్ ప్రెస్ సో స్పెషల్. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి లక్నో మీదుగా.. వారణాశి చేరుకునే ‘మహామనా’ ఎక్స్ ప్రెస్ రైలులో చాలానే విశేషాలు ఉన్నాయి. 14 గంటల వ్యవధిలో ఢిల్లీ నుంచి వారణాసికి చేరుకునే అవకాశం ఉన్న ఈ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో చాలానే వసతుల్ని ఏర్పాటు చేశారు. వారంలో మూడు రోజులు మాత్రమే తిరిగే ఈ రైలు (ఢిల్లీలో సోమ.. బుధ.. శుక్రవారాల్లో స్టార్ట్ అయితే.. వారణాసిలో మంగళ.. గురు.. శనివారాల్లో స్టార్ట్ అవుతుంది) 800 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ప్రధాని మోడీ స్టార్ట్ చేసిన ఈ ట్రైన్ విశేషాలు చూస్తే వావ్ అనాల్సిందే.
మహామనా ఎక్స్ ప్రెస్ విశేషాలు చూస్తే..
= రైలు మొత్తం ఫైర్ ఫ్రూప్.
= బయట నుంచి మంటలు అంటుకున్నా.. బోగీలకు ఎలాంటి ప్రమాదం ఉండదు
= ఈ రైలుకు అగ్నిప్రమాదం అయ్యే ఛాన్స్ లేదు
= ప్రయాణంలో కుదుపులు సహజం. అయితే.. ఈ రైల్లో అలాంటివి అస్సలు తెలీవు
= రైల్లో ప్రయాణించే సమయంలో కుదుపులు అన్నవి తెలీని విధంగా బెర్త్ ల్ని రూపొందించారు
= ప్రతి బోగీలోనూ ఎల్ ఈడీ బల్బులు అమర్చారు
= బోగీల్లో కొన్ని చోట్ల అందమైన పెయింటింగ్స్ ఏర్పాటు
= ప్రతి బెర్త్ వద్దా సెల్.. ల్యాప్ టాప్ ఛార్జర్ ఏర్పాటు
= టాయిలెట్లు మొత్తం బయో టాయిలెట్లు.. వీటికి అదనంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటాయి
= కింది బెర్త్ నుంచి పైబెర్త్ కు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా మెట్ల ఏర్పాటు