Begin typing your search above and press return to search.
అక్బరుద్దీన్ పై దాడి చేసిన పహిల్వాన్ మృతి
By: Tupaki Desk | 11 Feb 2020 6:45 AM GMTహైదరాబాద్ పాతబస్తీలో పహిల్వాన్లకు కొరత లేదు. చాలామంది ఉంటారు. కానీ.. ఒక పహిల్వాన్ తాజా మృతి ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. అందరూ ఆసక్తికరంగా చర్చించుకునే పరిస్థితి. ఎందుకంటే.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు.. అక్బరుద్దీన్ పై ఎనిమిదేళ్ల క్రితం కత్తిపోట్లు పొడిచిన కేసులో ఈ పహిల్వాన్ కూడా ఒక నిందితుడు. ఈ కారణంతోనే అతగాడి మరణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనారోగ్యం తో కొద్ది రోజులుగా యశోదా ఆసుపత్రి లో ఉన్న మహ్మద్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
ఎనిమిదేళ్ల క్రితం అక్బరుద్దీన్ పై కత్తితో దాడులు జరిగాయి. ఈ ఘటనలో అక్బరుద్దీన్ శరీరంలో రెండు బుల్లెట్లు.. 17 కత్తిపోట్లు దిగాయి. దీంతో.. ఎమ్మెల్యేల గన్ మెన్లు కూడా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్ ను హుటాహుటిన కేర్ ఆసుపత్రి కి తరలించారు.
ఈ సమయంలో అక్కడి వైద్యులు అక్బరుద్దీన్ శరీరంలో దిగిన ఒక బుల్లెట్ ను బయటకు తీస్తే.. మరొకటి అలానే ఉంచేశారు. ఇప్పటికి అక్బరుద్దీన్ బాడీలోనే మరో బుల్లెట్ ఉంది. కత్తిపోట్ల కారణంగా అక్బరుద్దీన్ ఆ తర్వాత కాలంలో అనారోగ్యగానికి గురయ్యారు. విదేశాల్లోనూ వైద్య చికిత్సలు చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పటికి ఆయన ఆరోగ్యం కుదుటపడలేదని చెబుతారు.
ఇదిలా అక్బరుద్దీన్ పై దాడి కేసులో నిందితుడైన మహ్మద్ పహిల్వాన్ ను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం జైల్లో ఉన్నారు. తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చారు. తాజాగా గుండె పోటుతో మరణించినట్లు గా చెబుతున్నారు. అక్బరుద్దీన్ దాడి కేసులో కోర్టు తీర్పు రాక ముందే.. నిందితుడు మరణించటం గమనార్హం.