Begin typing your search above and press return to search.
మహానాడు ఎఫెక్ట్ : ఆ మూడు పార్టీల మీద గట్టిగానే...?
By: Tupaki Desk | 1 Jun 2022 12:30 AM GMTమహానాడు విజయవంతం అయింది. అలా ఇలా కాకుండా జనాలు వెల్లువలా లక్షలలో తరలిరావడం ఈసారి మహానాడు విశేషంగా చూడాలి. మహానాడు సూపర్ హిట్ తో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా కీలకమైన మార్పులు వస్తున్నాయి. మహానాడుకు ముందు వెనకా అన్నట్లుగా ఇపుడు ఏపీ పాలిటిక్స్ ని చూడాల్సి ఉంది. మహనాడు కి కనుక జనాదరణ లేకపోతే టీడీపీ ఈ రోజుకూ వీక్ గా ఈ రోజుకు ఉందని వైసీపీ వేళాకోళం చేసేది. ఇంకా లైట్ గా తీసుకునేది.
అదే టైమ్ లో టీడీపీలో కూడా సీనియర్లు పెదవివిరిచేవారు. వేరే ఆలోచనలూ కొందరు చేసేవారు. ఇక తమ్ముళ్ళు నిరాశాలో నిండా మునిగేవారు. అదే సమయంలో పొత్తులు ఎత్తుల గురించి ఇంకా సీరియస్ గా అధినాయకత్వం ఆలోచించాల్సి వచ్చేది. ఆదరాబాదరాగా ప్రకటనలు కూడా చేయాల్సి వచ్చేది.
కానీ ఇపుడు అలాంటి ఆదుర్దా లేకుండా మహానాడు పూర్తి బూస్టప్ ఇచ్చేసింది. ఆచీ తూచీ అడుగులు వేయవచ్చు అన్న ధీమాను పసుపు పార్టీ పెద్దలకు కలుగచేసింది. దాంతో మహానాడు ఇచ్చిన ఉత్సాహం ఇపుడు హై కమాండ్ లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలుగచేయడంతో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీద దృష్టి పెడుతున్నారు. పొత్తుల మాటను తాత్కాలికంగాన అయినా పక్కన పెడుతున్నారు.
అది ఎన్నికలకు కొద్ది నెలల ముందు చూసుకోవాల్సిన విషయం అని కూడా అంటున్నారు. అంటే ఒకే ఒక్క మహానాడు టీడీపీలో అంతటి ధైర్యాన్ని నింపి జనాలే రోడ్ మ్యాప్ ని ఇస్తే విపక్ష శిబిరంలో కలవరం రేపేలా చేసింది అని కూడా అంటున్నారు. ఇక అధికార వైసీపీకి అయితే జాగ్రత్త సుమా అన్న రెడ్ అలెర్ట్ వచ్చేసింది.
టీడీపీని లైట్ గా తీసుకుంటే మునిగేది వైసీపీ పుట్టె సుమా అని కూడా హెచ్చరించినట్లు అయింది. దాంతో ఫ్యాన్ పార్టీ ఇపుడు చర్చోపచర్చలతో నిమగ్నం అయింది. తాము ఏం చేయాలి అన్న దాని మీదనే మధనం పడేలా మహానాడు హిట్ టాక్ ఉందని కూడా అంటున్నారు.
మరో వైపు విపక్షంలో చూస్తే టీడీపీలో పొత్తే వద్దు, ఏపీలో మాకు మేమే సాటి, జనసేనతో పొత్తు పెట్టుకుని ఒంటిచేత్తో గెలుస్తామని బీరాలు పలుకుతున్న బీజేపీలో కూడా వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. తెలుగుదేశంతో చేయి కలపకపోతే నష్టపోవడం ఖాయమన్న మాట కూడా వినిపిస్తోందిట.
తెలుగుదేశంతో చెలిమి చేస్తే కచ్చితంగా గెలవడంతో పాటు ఎన్నో కొన్ని సీట్లు దక్కుతాయని కూడా కమలనాధుల మాటగా ఉంది అంటున్నారు. ఇక జనసేన విషయం ఇపుడు అతి కీలకంగా చెప్పుకోవాలి. ఇప్పటిదాకా ఏపీలో జగన్ తరువాతనో ముందో అతి పెద్ద గ్లామర్ ఫిగర్ పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఆ పార్టీ నమ్ముతూ వచ్చింది. ఏపీలో టీడీపీ సినిమా చూసేశారు, జగన్ సినిమా కూడా అయిపోయింది, ఇక మిగిలింది జనసేన అని కూడా భావించారు.
అందువల్ల జనసేన మీద ఈసారి జనాల ఫోకస్ ఎక్కువగా ఉంటుదని కూడా ఊహిస్తూ ముందుకు పోయారు. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉన్నా సీఎం పవన్ బాబే అని కూడా నినాదాలు చేస్తూ వచ్చారు. ఇపుడు మహానాడు ఆ పార్టీకి కూడా కళ్ళ ముందు నిజాలు చెప్పింది అంటున్నారు. టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీ. ఆ పార్టీ జనాలు ఈ రోజుకూ అలాగే ఉన్నారు గ్లామర్ కంటే గ్రామర్ ఎక్కువ ఉన్న టీడీపీయే 2024లో ఫోర్ ఫ్రంట్ లో నిలిచే పార్టీ అని కూడా అర్ధమైంది.
మరో వైపు మహానాడు వేదికగా టీడీపీ పెద్దలు పొత్తుల గురించి చెప్పకపోవడం పట్ల కూడా జనసేనలో మధనం సాగుతోంది. ఈ బలం కనుక నిజమైతే టీడీపీని పట్టుకోవడం కష్టం అవుతుంది అని కూడా జనసేనలో ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. మూడేళ్ళు గడచిపోయాయి. జనసేన ఇంకా పటిష్టం కాలేదు. అదే టైమ్ లో తామే అటు బీజేపీకి ఇటు టీడీపీకి దిక్కు అని ఆ పార్టీ భావిస్తూ వచ్చింది.
ఇపుడు జనాల మొగ్గు జగన్ కాకపోతే చంద్రబాబే అన్నట్లుగా ఉండడంతో జనసేనలో మధనం జరుగుతోంది అంటున్నారు. పవన్ సీఎం అన్న మాట సాకారం అయ్యే సీన్ ఈ పరిస్థితుల్లో ఉంటుందా అన్న చర్చ కూడా వస్తోందిట. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పాతిక నుంచి ముప్పయి సీట్ల కంటే రాలే సీన్ అయితే లేదని అంటున్నారు.
అలాగని ఒంటరిగా బరిలోకి దిగితే ఎలా రాజకీయం ఉంటుందో తెలియని పరిస్థితి. మొత్తానికి జనసేన గందరగోళానికి మహానాడు ఒక కారణం అని అంటున్నారు. ఇలా ఏపీ రాజకీయాల్లో అన్ని పార్టీలలో చర్చకు మహానాడు సక్సెస్ తెరతీసింది అనే అంటున్నారు. చూడాలి మరి దీన్ని చూసుకుని భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో.