Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లోనే టీడీపీ పండుగ

By:  Tupaki Desk   |   24 May 2021 12:30 PM GMT
ఆన్ లైన్ లోనే టీడీపీ పండుగ
X
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తెలుగుదేశం పార్టీ పండుగ ఆన్ లైన్ కే పరిమితమవుతోంది. ప్రతీఏటా ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 28న తెలుగు రాష్ట్రాల్లో మహానాడును పార్టీ పండుగలా టీడీపీ అధినేత చంద్రబాబు , పార్టీ శ్రేణులు నిర్వహించేవారు. కానీ పోయిన సారి కరోనాతో.. ఈసారి సెకండ్ వేవ్ తో ఈ పండుగ కేవలం ఆన్ లైన్ లోనే వర్చువల్ గా కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

తాజాగా టీడీపీ అదినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈనెలలో జరిగే మహానాడు కార్యక్రమంపై సమావేశంలో చర్చించారు ఈనెల 27, 28 తేదీల్లో డిజిటల్ వేదికగా మహానాడు నిర్వహించడానికి ఆమోదం తెలిపారు.

ఇక కర్నూలు జిల్లా బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, ఇతర నేతల అరెస్ట్ ను పొలిట్ బ్యూరో ఖండించింది. కరోనా సమయంలోనూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యం ఇస్తుందని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది.

మే 28వ తేదీన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడును మాత్రం జరుపుతూనే ఉన్నారు. ఏదైనా తుఫాన్, ప్రకృతి వైపరీత్యాల్లోనే మహానాడును నిర్వహించలేదు. కానీ కరోనాతో 2019 తర్వాత కరోనాతో వరుసగా రెండో ఏడాది కూడా మహానాడును నిర్వహించలేకపోతున్నారు.