Begin typing your search above and press return to search.

మహా సర్కారును కూల్చింది మోదీ, షానే.. అసెంబ్లీలోనే చెప్పిన షిండే

By:  Tupaki Desk   |   5 July 2022 7:14 AM GMT
మహా సర్కారును కూల్చింది మోదీ, షానే.. అసెంబ్లీలోనే చెప్పిన షిండే
X
రెండు వారాల కిందటి వరకు సజావుగా సాగిన మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే సర్కారు ఉన్నఫళంగా ఎలా కూలిపోయింది..? శివసేన వీర సైనికుడు ఏక్ నాథ్ షిండే అంతగా ఎలా తిరుగుబాటు
చేయగలిగారు..? అసలు ఉద్ధవ్ థాక్రే-శరద్ పవార్-కాంగ్రెస్ కూటమిలోని ప్రభుత్వాన్ని పడగొట్టేంత ధైర్యం ఆయనకు ఎవరిచ్చారు..? మరెవరో కాదు.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి
అమిత్ షాలే. ఈ మాటన్నది ఎవరో కాదు.. మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్ నాథ్ షిండే. అది కూడా నిండు అసెంబ్లీలోనే. సోమవారం బల పరీక్ష సందర్భంగా షిండే ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఈ మెత్తం కథ వెనుక ఉన్న కళాకారుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అని చెప్పారు. దీంతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ హస్తం ఉందని..
తషిండేకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అండవుందని తేలిపోయింది! కాగా, సోమవారం అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో షిండే 164 ఓట్లతో సునాయాస విజయం సాధించారు.

సీఎం హోదాలో..

అసెంబ్లీలో బల పరీక్ష నెగ్గాక.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రసంగింగిస్తూ భావోద్వేగానికి గురైన షిండే.. తనవెనుక మోదీ, షా ఉన్నట్లు చెప్పారు. ‘‘ఇదంతా ఒక్క రోజులో జరిగింది
కాదు. మా సంఖ్యా బలం (తిరుగుబాటుదారులు) తక్కువగా ఉన్నప్పుడు మోదీ ఆశీర్వాదం లభించింది.

ప్రమాణ స్వీకారానికి ముందు దాకా అన్నివిధాలుగా సాయం చేస్తామన్నారు. ఇక
అమిత్‌షా కొండలా అండగా ఉంటానని చెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు వెనుక అతిపెద్ద కళాకారు డు దేవేంద్ర ఫడణవీస్‌. మా గ్రూపు ఎమ్మెల్యేలు నిద్రపోయే సమయంలో మేమిద్దరం
కలిసేవాళ్లం. వాళ్లు లేచేలోగా సర్దుకునేవాళ్లం’’ అని షిండే తెలిపారు. తద్వారా తిరుగుబాటు వెనుక బీజేపీ క్రియాశీల పాత్ర ఉందనే విషయాన్ని ఆయన ప్రపంచానికి స్పష్టం చేశారు. అ
యితే, నిండుసభలో షిండే ఈ విషయాలు చెప్పడం తో ఫడణవీస్‌ కొద్దిగా ఇబ్బందిపడ్డారు.

గట్టెక్కిన షిండే సర్కారు.. హాజరైంది 263 మందే..

మహారాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్య 288. ఒక సీటు ఖాళీగా ఉంది. కొత్త సీఎం షిండె సాధారణ మెజారిటీ సాధించాలంటే 144 ఓట్లు కావాలి. కాగా, సోమవారం బల పరీక్షలో 263 మంది
సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. అయినా 164 మంది షిండేకు అనుకూలంగా ఓటు వేశారు. అబు అజ్మీ, రయీస్‌ షేక్‌ (సమాజ్ వాదీ), షా ఫారుఖ్‌ అన్వర్‌ (ఎంఐఎం) ఓటింగ్‌కు దూరంగా
ఉన్నారు. 11 మంది కాం గ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, మజ్లిస్‌ ఎమ్మెల్యే ఒకరు గైర్హాజరయ్యారు. ముందురోజు దాకా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గంలో
ఉన్న 13 మందిలోనూ ఇద్దరు షిండేకు అనుకూలంగా ఓటు వేశారు.

మోదీ, షాకు ఎందుకంత కక్ష?

దేశంలో అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అందులోనూ 2019కి ముందు అక్కడున్నది బీజేపీ-శివసేన సర్కారు. ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినా.. బీజేపీ 106 సీట్లు గెల్చుకుంది. శివసేన 56
చోట్ల నెగ్గింది. అయితే, ఏ పార్టీకి ఆధిక్యం రాని చోట సీఎం కుర్చీ దగ్గర పీటముడి పడింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సీఎం పీఠం కోసం పట్టుబట్టారు. అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి
సర్కారు ఏర్పాటు చేశారు. ఈ మధ్యలో వీర డ్రామా నడిచింది.

2019 ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా కొన్ని రోజులు ఉన్నారు. కానీ, బలంసరిపోక రాజీనామా చేశారు. ఇక ఉద్ధవ్ సీఎం అయ్యాక.. శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ, మోదీ మీద విరుచుకుపడడం ప్రారంభించారు. కొవిడ్ కారణమో.. షిండేను దువ్వడంలో ఆలస్యమో కానీ.. రెండున్నరేళ్లు ఓపిక పట్టిన మోదీ, షా ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకున్నారు. అలా.. మహారాష్ట్రను తమ ఖాతాలో వేసుకున్నారు.