Begin typing your search above and press return to search.

అన్నా హ‌జారే కు జ‌డ్ ఫ్ల‌స్ సెక్యూరిటీ

By:  Tupaki Desk   |   21 Aug 2015 1:53 PM GMT
అన్నా హ‌జారే కు జ‌డ్ ఫ్ల‌స్ సెక్యూరిటీ
X
ప్ర‌ముఖ సామజిక ఉద్యమకారుడు అన్నా హజారే కు మహారాష్ట్ర ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటి కల్పించింది. ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం పోరాటాలు చేసే అన్నాకు ఇటీవ‌ల వ‌రుస‌గా బెదిరింపు లేఖ‌లు వ‌స్తున్నాయి. గురువారం కూడా గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదిరింపు లేఖ వ‌చ్చింది. ఇటీవ‌ల అన్నాకు వ‌చ్చిన ఓ లేఖ‌లో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు దూరంగా ఉండాల‌ని అగంత‌కులు పేర్కొన్నారు. ఈ నేప‌థ్య‌లో ప్ర‌భుత్వం అన్నాకు జ‌డ్ ఫ్ల‌స్ సెక్యూరిటీ క‌ల్పించింది. ఈ మేర‌కు మ‌హారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ కూడా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఈ విష‌య‌మై సీరియ‌స్‌ గా ఉండాల‌ని సూచించారు.

ప్రారంభంలో సామాజిక స‌మ‌స్య‌ల‌పై క‌లిసి పోరాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, హ‌జారే త‌ర్వాత విబేధాల‌తో దూర‌మ‌య్యారు. గాంధేయ‌వాది అయిన అన్నా ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ పాల‌కుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. వారం రోజుల క్రితం హ‌జారేకు మ‌హ‌దేవ్ పంచాల్ పేరుతో ఆయ‌న్ను బెద‌రిస్తూ లేఖ వ‌చ్చింది.

ఇటీవ‌ల హ‌జారే ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించిన భూసేక‌ర‌ణ బిల్లుతో పాటు మాజీ సైనికుల‌కు కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ‌న్ ర్యాంకు వ‌న్ పెన్ష‌న్ విధానాన్ని కూడా తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇందుకు దేశ‌వ్యాప్తంగా హ‌జారే కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఈ బెదిరింపు లేఖ రావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. హ‌జారేకు మ‌హారాష్ర్ట పోలీసులు జ‌డ్ ఫ్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో పాటుఈ లేఖ‌పై విచార‌ణ చేస్తున్నారు.